అవును.. అందరూ సీఎం జగన్ ని గురించి చెప్తారు కానీ.. విజయమ్మ గురించి చెప్పరు ఏంటి బాబు. అని ఇప్పటికే చాలామంది అనుకోని ఉంటారు.. అయితే సీఎం జగన్ విన్నర్ అయితే విజయమ్మ మెగా విన్నర్ అయ్యారు.. ఎందుకంటే? విజయమ్మ భర్త వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రే.. కొడుకు ముఖ్యమంత్రే. 

 

అంతేకాదు.. భర్త గెలుపు కోసం ఇంట్లో ఉండి ప్రజలకు, అతిధులకు ఆమె సేవ చేస్తే.. కొడుకు గెలుపు కోసం రోడ్ల వెంట తిరిగి రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి దగ్గరవుతూ వచ్చి కొడుకు గెలుపులో కీలక పాత్ర వహించారు.. కొడుకు గెలుపుకోసం.. ప్రజల క్షేమం కోసం 53 ఏళ్ళ వయసులో ఆమె రాజకీయాలలోకి అడుగు పెట్టారు... ఎన్నో కష్టాలు.. అడుగడుగునా అణచివేత..

 

విజయం సాధించిన భర్త దూరమైనా కొడుకు ముఖ్యమంత్రి కావడానికి ఆమె పడిన కష్టం అంతాఇంతా కాదు. 2019లో రాష్ట్రంలో వైసీపీ పార్టీ సాధించిన ఘన విజయంలో విజయమ్మ పాత్ర కూడా ఎంతో ఉంది. .. ఆంధ్ర రాష్ట్రంలో.. ఎండ.. వాన.. చలి ఏమి లేకుండా కొడుకు ముఖ్యమంత్రి కావడానికి విజయమ్మ ఎంతో కష్టపడ్డారు. 2019 మే 23న ఆ కష్టానికి తగిన ప్రతిఫలం రానే వచ్చింది.

 

విజయమ్మ ప్రోత్సాహమే సీఎం జగన్ కు బలాన్ని ఇచ్చింది. తల్లి ఇచ్చిన దైర్యం కంటే ఏది ఎక్కువ కాదు కదా! ఏ బిడ్డ అయినా విజయం సాధించాడు అంటే.. ముందు తల్లికి ఉన్న నమ్మకం అనే చెప్పాలి. తల్లి నమ్మకమే బిడ్డని విజయానికి దగ్గర చేస్తుంది. అందుకే సీఎం జగన్ విన్నర్ అయితే విజయమ్మ మెగా విన్నర్ అయ్యారు.. ఇప్పుడైనా ఒప్పుకుంటారా? మనం ఎవరు వైఎస్ జగన్ ని నమ్మక ముందే తల్లి నమ్మి అతనిలో సీఎం పవర్ ఉంది అని గుర్తించి సీఎం జగన్ చేసింది అని.

మరింత సమాచారం తెలుసుకోండి: