అవును.. ప్రజానాయకుడు అయిన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణించారు.. అప్పుడప్పుడే రాజకీయాలలో ఓనమాలు నేర్చుకుంటున్న వైఎస్ జగన్ కు రాజకీయాల పరంగా సలహాలు చెప్పే వారే కరువయ్యారు.. ముఖ్యమంత్రి మరణంతో అందరూ వచ్చి అయ్యో అని ఓదార్చే వారే తప్ప.. తండ్రి మరణం తర్వాత జగన్ తో కలిసి నడిచే నాయకులే కరువయ్యారు.

 

IHG

 

ఆ సమయంలోనే.. రాజకీయంలో అడుగులు వెయ్యాలి అని.. మళ్లీ మన కుటుంబం ప్రజలకు సేవ చెయ్యాలి అని వైఎస్ జగన్ రాజకీయ భవితకు తొలి సలహాదారయ్యారు విజయమ్మ. ఆమె ప్రోత్సాహం వల్లే ఈరోజు ఆ మహనీయుడు పుత్రుడిని మనం ముఖ్యమంత్రిగా చూస్తున్నాం. వైయస్ రాజశేఖర్ రెడ్డి 2009లో కాంగ్రెస్ పార్టీని రెండోసారి అధికారంలోకి తీసుకొచ్చారు.

 

IHG

 

కానీ రాజశేఖరుడి మరణాంతరం కొడుకును అడవుల పాలు చెయ్యాలి అనుకుంది ఆ కాంగ్రెస్ పార్టీ.. అందుకే 125 ఏళ్ళ చరిత్ర ఉన్న పార్టీని ఎదిరించి జగన్ వైసీపీ పార్టీ పెట్టారు.. పార్టీ పెట్టిన సమయం నుండి వైఎస్ కుటుంబం ఎన్నో కష్టాలు పడింది.. ఒకానొక సమయంలో ఆ కుటుంబాన్ని రోడ్డుపైకి లాగారు..  

 

IHG

 

ఎన్ని కష్టాలు ఎదురైనా వెనుకడుగు వేయకుండా ప్రజలకు మంచి చేయాలనే లక్ష్యంతో జగన్ ముందడుగులు వేశాడు. ఇప్పుడు వైఎస్ జగన్ రాజకీయనాయకుడు కాదు.. ప్రజల నాయకుడు.. వైఎస్ కుటుంబం అంటేనే ప్రజా సేవ అని.. విజయమ్మ సీఎం జగన్ కు నేర్పిన రాజకీయ పాఠాలు ఇప్పుడు రూపం దాల్చుతుంటే ప్రజల ముఖాల్లో చిరునవ్వులు చిందుతున్నాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి: