ఏంటి? అంత ఘుమ ఘుమలు ఆడే వంటకం ఏంటి అని అనుకుంటున్నారా? ఒకటి కాదు.. రెండు కాదు.. ఎన్నో రకాల అద్భుతమైన వంటకాలు అవి.. ఎం చెప్తున్నారు అని అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్న.. ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా ఎందరో మరణిస్తున్నారు.. ఇంకా అలాంటి ఈ కరోనా వైరస్ ని నియంత్రించేందుకు ప్రపంచ దేశాలు లాక్ డౌన్ విధించాయి. 

 

దీంతో ఉద్యోగాలు, వ్యాపారాలు అన్ని ఆగిపోయాయి. అందరూ ఇళ్లకే పరిమితం అయ్యారు. దీంతో ప్రజలంతా కూడా ఇంట్లో ఒకరోజు ఉండమంటేనే ఉండరు.. ఇంకా అలాంటి వారు వారలు , నెలల పాటు ఇంట్లో తీరికగా కాలిగా కూర్చోమంటే ఎందుకు కూర్చుంటారు.. ఇంకా అంతేకాదు.. వంట వండేకి పని మినిషి రావడం లేదు.. ఎవరి పని వాళ్లే చేసుకోవాలి. 

 

అందుకే తమలోని వంట కళను బయటకు తియ్యాలి అనుకున్నారు.. కానీ ఎవరికి వచ్చు అంత బాగా.. ఇంట్లో పెద్ద వాళ్ళు ఉంటే ఓకే. నో ప్రాబ్లెమ్. ఎలాగోలా వంట చేసేయచ్చు. కానీ పెద్ద వాళ్ళు లేకపోతే ఆలా చెయ్యలేరు కదా! అందుకే అందరూ కూడా గూగుల్ పై పడ్డారు.. గూగుల్ తల్లి ఉప్పు వెయ్యమంటే ఉప్పు.. చక్కర వెయ్యమంటే చక్కర.. 

 

దీంతో నెట్టిల్లు అంత కూడా గుమగుమలాడుతుంది.. ఎప్పుడు గెరట పట్టని వారంతా గెరట పట్టి వంట చేసేస్తున్నారు.. బయట పిజ్జాలు, బర్గర్ లు దొరకక అల్లాడి పోతున్నారు. అందుకే అందరూ ఇంట్లోనే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంకా ఆ ప్రయత్నాలలో కొన్ని బాగా వస్తే.. మరికొన్ని మాడిపోతున్నాయి. అయితే ఎక్కువ శాతం వంటకాలు మాడిపోతున్నాయి అని అంటున్నారు. 

 

ఇంకా మన టాలీవుడ్ తారలు.. యాంకర్లు.. అందరూ కూడా గెరట పట్టి వంట చేస్తున్నారు.. ఇప్పటికే శ్రీముఖి, యాంకర్ రవి, యాంకర్ అనసూయ అందరూ కూడా వంటలు చేసి సోషల్ మీడియాలో పెట్టేస్తున్నారు.. ఇంకా ఆ ఫోటోలు కూడా ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: