ఒక నాయకుడు తయారు కావాలంటే అతని తొలి గురువు అమ్మే కావాలి. అలా అమ్మ గోరు ముద్దుల్లో పరాక్రమాన్ని నూరిపోసిన కథలు మన చరిత్రలో చాలానే ఉన్నాయి. జిజియా భాయ్ చెప్పిన పాఠాలు విని శివాజీ ఛత్రపతిగా ఎలా మారాడో కథలు కథలుగా చెప్పుకుంటాం. కానీ అలాంటి ఓ జిజియా భాయ్‌ ఈ తరంలో కూడా ఉంది. ఎన్ని కష్టలు ఎదురైనా ప్రజసేవ కోసం తన వంతు బాధ్యత నిర్వర్తిస్తోంది. ఆమె వైఎస్‌ విజయమ్మ.

 

వైయస్‌ రాజశేఖర్ రెడ్డి సతీమణిగా నిండైన తెలుగు తనంతో ఆమె కనిపించి ప్రతీసారి ప్రతీ తెలుగు వాడు అమ్మలా గౌరవించాడు. రాజన్న ప్రజా సేవలో ఉంటే ఇంటి బాధ్యతల విషయంలో అంతా తానే వ్యవహరించి రాజన్నకు సాయం చేసింది. పిల్లల బాధ్యతను మోస్తూ పెద్దలకు చేదోడు వాదోడుగా ఉంటూ కుటుంబానికి పెద్ద దిక్కై నిలిచింది.

 

రాజన్న రాజకీయంలో పరోక్షంగా విజయమ్మ ఆలోచనల ప్రభావం కూడా ఎంతో ఉంటుంది అంటారు సన్నిహితులు. ఇక జగన్‌ మోహన్‌ రెడ్డి విషయంలో విజయమ్మ ఓ జిజియా భాయ్‌లా మారింది. రాజన్న రాజకీయాల్లో బిజీగా ఉండి పిల్లల ఆలనా పాలనా చూసే సమయం కూడా లేనప్పుడు తండ్రి అంత బిజీగా ఎందుకు ఉన్నాడు. ప్రజాసేవ మనకు ఎందుకు అన్న విషయంలో పిల్లలకు సేవా భావాన్ని నూరి పోసింది విజయమ్మ.

 

నాయకుడంటే పోరాడాలని కష్టాలకు, సమస్యలకు వెన్నుచూపవద్దని, నువ్వు కష్టాల్లో ఉన్న నిన్ను నమ్ముకున్న వారు కష్టపడకుండా చూసుకోవాలని నాయకత్వ లక్షణాలను నేర్పింది. జిజియా భాయ్‌గా మారి జగన్‌ను ఓ ఛత్రపతిలా తీర్చి దిద్దింది. అందుకే రాజన్న తనయుడు తండ్రి మించిన కొడుకుగా నేడు రాజ్యపాలన చేస్తున్నాడు. ఆర్ధికంగా వెనకపడిన రాష్ట్రం, అవకాశం కోసం గోతికాడ నక్కల్లా ఎదురుచూస్తున్న ప్రత్యర్థులు, తలకు మించిన సమస్యలు ఇలా ఎన్ని ఇబ్బందులు ఉన్నా చెదరని చిరునవ్వుతో ఆ సమస్యలను దాటేస్తున్నాడు విజయమ్మ తనయుడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: