భర్త ముఖ్యమంత్రి... కొడుకు, కూతురు ఆర్థికంగా ఎంతో ఉన్నతంగా ఉన్నారు. మనవళ్లు, మనవరాళ్లు ఉన్నత చదువుల అభ్యసిస్తూ ఎదుగుతున్నారు. ఓ ఇంటి పెద్దకు ఇంత కన్నా ఏం కావాలి. అలాంటి సంపూర్ణ జీవితం వైఎస్ విజయమ్మది. కానీ ఒక్కసారిగా పరిస్థితులు తారుమారయ్యాయి. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న భర్త రాజశేఖర్‌ రెడ్డి హెలికాప్టర్‌ ప్రమాదంలో మరణించటంతో అప్పటి వరకు కష్టం తెలియని ఆమె జీవితంలోకి సమస్యలు క్యూ కట్టాయి.

 

తండ్రి అసంపూర్ణంగా వదిలేసిన పనులు తన తండ్రి కొనసాగించాలని భావించింది విజయమ్మ. అందుకే తండ్రి బాటలో కొడుకు వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయి ప్రజా సేవకు అంకితం కావాలని ఆశించింది. కానీ ఆమె కోరికకు ఎన్నో అడ్డంకులు. రాజన్న నిర్మించిన కోటలకి ఆయన తనయుడికే ప్రవేశం లేదన్నారు. అధిష్టానం అన్నింటా అడ్డంకులు సృష్టించింది. చివరకు తండ్రిని మరణంతో గుండెపగిలి చనిపోయిన వారిని పరమర్శించేందుకు కూడా అడ్డుకున్నారు.

 

అధిష్టానం మాటను దిక్కరించటంతో సమస్యలు పెరిగాయి. తప్పని పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీని వీడాల్సి వచ్చింది. తాను గురువై కొడుకును కొత్త పార్టీ దిశగా నడిపించింది విజయమ్మ. అంతలోనే మరో పిడుగు లాంటి వార్త, కుటుంబానికి అండగా ఉంటాడనుకున్న కొడుకును జైలుకు పంపించారు. అయినా విజయమ్మ ధైర్యం సన్నగిళ్లలేదు. కొడుకైనా, కూతురైనా ఆ రక్తమే కదా అందుకే జగనన్న వదిలిన బాణంగా షర్మిల బరిలో నిలిపింది.

 

భర్త చనిపోయిన బాధ వేదిస్తున్నా.. కొడుకు జైలు పాలైయ్యాడన్న వేదన గుండెను పిండేస్తున్నా.. కూతురును యుద్ధం రంగంలోకి దింపింది. రాజన్న ఉన్నంత కాలం గడప దాటకుండా ఇంటి పనులకే అంకితమైన విజయమ్మ రాజన్న మరణం తరువాత ఓ పెద్ద యుద్దమే చేసింది. సమస్యలతో, ప్రత్యర్థులతో, కాలంతో ఆమె సాగించిన పోరాటంలో ఆమె పట్టుదల ముందు విధి కూడా తల వంచింది. అందుకే అధికార పీఠం మళ్లీ ఆమె ఇంటికి నడిచొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: