ఓ వైపు కరోనా రోజు రోజుకీ తన ప్రభావం విపరీతంగా చూపిస్తుంది.  అయితే కరోనా కు ఇప్పటి వరకు సరైన మందు కనుగొనలేక పోయారు.  అయితే కరోనాని కేవలం మనం జాగ్రత్తల తీసుకొని నివారించాలని అంటున్నారు .  కరోనా వ్యాప్తి జరగకుండా లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే.  గత నెల 24 నుంచి లాక్ డౌన్ ప్రారంభం అయ్యింది.  అన్ని రాష్ట్రాల్లో లాక్ డౌన్ సీరియస్ గానే కొనసాగుతున్నా కొన్ని చోట్ల మాత్రం లాక్ డౌన్ ఉల్లంఘనకు పాల్పపడుతున్నారు.  తాజాగా తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు వరుసగా పెరుగూతూనే ఉన్నాయి.. ఇక, హైదరాబాద్‌ పాతబస్తీలో ఒక మహిళ నుంచి 80 మందికి కరోనా సోకడం కలకలం సృష్టిస్తోంది. భవానీనగర్‌కు చెందిన ఓ వృద్ధురాలు అనారోగ్యం పాలైంది.   

 

దీంతో ఆమెను స్దానికంగా గల ఒక డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లారు కుటుంబ సభ్యులు. అక్కడి నుంచి అదే ప్రాంతంలో వున్న మరో ప్రైవేట్‌ ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు. అయితే, వృద్ధురాలికి కరోనా సోకిందేమోననే సందేహం డాక్టర్లకు గాని, వైద్య సిబ్బంది గాని రాలేదు. అయితే, వృద్ధురాలు చనిపోవడంతో సాధారణ మరణంగానే భావించారు. బంధువులంతా కలిసి అంత్యక్రియలు నిర్వహించారు. కానీ... శాంపిల్స్‌ సేకరించిన అధికారులు... రిపోర్టుల్లో కరోనా పాజిటీవ్‌ రావడంతో అప్రమత్తమయ్యారు.  వృద్ధురాలి కుటుంబంలో ఒకరు ఇటీవల ఢిల్లీ మర్కజ్ కు వెళ్లి వచ్చారు.

 

ప్రైమరీ కాంటాక్ట్‌ పద్ధతిలో వృద్ధురాలికి కరోనా వైరస్‌ సోకింది. ఆమెతో ఉన్న కుటుంబ సభ్యులకు కరోనా పరీక్షలు నిర్వహించగా.. 22 మందికి కరోనా పాజిటీవ్‌ వచ్చింది. మరికొందరి రిపోర్టులు అందాల్సి ఉంది. వీళ్లందర్నీ ఆస్పత్రులకు తరలించి, వాళ్లతో కలిసి మెలసి తిరిగిన వాళ్లను గుర్తించే పని ప్రారంభించారు అధికారులు. వృద్ధురాలికి చికిత్స చేసిన ముగ్గురు డాక్టర్లు, నలుగురు నర్సులు కరోనా బారిన పడ్డారు. మొత్తానికి 80 మంది కరోనా భారిన పడ్డట్టు తెలుస్తుంది.

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: