దేశంలో మొత్తం సీరియస్ గా లాక్ డౌన్ చేస్తుంటే కొంత మంది మాత్రం పనికట్టుకొని లాక్ డౌన్ ఉల్లంఘన చేస్తున్నారు.  లాక్ డౌన్ కారణంగా అందరూ ఇంటి పట్టున ఉండాలని అంటున్నా ఎవరూ ఖాతరు చేయడం లేదు.    కరోనా ప్రబలకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేస్తున్నప్పటికీ కొందరి వాటిని తుంగలో తొక్కుతున్నారు.  తాజాగా కృష్ణా జిల్లా పెడనలోని ఆర్‌సీఎమ్ చర్చిలో ఓ ఫాదర్ వంద మందితో ప్రార్థనలు నిర్వహించాడు.

 

లాక్‌డౌన్ సమయంలో ఇదేంటని ప్రశ్నించగా... కుటుంబానికి ఒక్కరినే రమ్మన్నామని, కరోనా గురించి చర్చించేందుకే ఈ ప్రార్థనలు అని ఫాదర్ చెప్పుకొచ్చాడు.  లాక్‌డౌన్ విధించడంతో పాటు గుంపులుగా తిరగవద్దని, సోషల్ డిస్టెన్స్ పాటించాలంటూ చెబుతున్నా...ఆ నిబంధనలు కొందరు కాలరాస్తూ కరోనా వ్యాప్తికి కారకులవుతున్నారు.

 

ఇదిలా ఉంటే.. 24 గంటల్లో భారత్‌లో కొత్తగా నమోదైన కేసులతో కలిపి దేశంలో కరోనా కేసుల సంఖ్య మొత్తం 15,712కు చేరగా, ఇప్పటివరకు మొత్తం 507 మంది మృతి చెందారని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తెలిపింది.

 


కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 


 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: