లవంగం చూడడానికి చాలా చిన్నగా ఉన్నా కూడా.. దీనివల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. లవంగం దంతాలని బాగా సంరక్షిస్తుంది. ఇక లవంగం నీటిలో వేసుకొని తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే.. ప్రతిరోజు తప్పకుండా తాగుతారు. ఎక్కువ శాతం లవంగాన్ని చిగుళ్ల సమస్య కోసం ఉపయోగిస్తూ ఉంటారు. లవంగంలో ఉండే విటమిన్ C, K, ఫైబర్, మాంగనీస్, యాంటీఆక్సిడెంట్స్ ఇలాంటివి అన్ని కూడా ఇందులో లభిస్తాయి. ఇక లవంగాలను డైరెక్టుగా తినడం కంటే... నీటిలో వేసుకొని తాగితే చాలా మంచిదని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు.

 


సాధారణంగా లవంగం మీకు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా శరీరక అధిక బరువును కూడా తగ్గించడానికి సహాయపడుతుంది. దీనితోపాటు శరీరంలో ఉన్న వేడిని కూడా తగ్గించడంలో సహాయపడుతుందని చెప్పాలి. ఎక్కువ శాతం మంది వారి బరువుని తగ్గించుకునేందుకు లవంగం నీరు తాగుతారు. దీనికోసం ముందుగా రాత్రి ఒక గ్లాస్ నీటిలో రెండు లవంగాలను వేసి ఉదయం వరకు నానబెట్టాలి. ఉదయం పరగడుపున ఈ నీళ్లను తాగడం వలన కడుపుకు సంబంధిత సమస్యలు అన్నీ అధిగమించి పోవచ్చు.

 

 

ఇక బరువు తగ్గాలనుకునేవారు... లవంగం, దాల్చిన చెక్క, జీలకర్రను ఉపయోగిస్తే చాలు. ఈ మూడింటినీ కలిపి వేయించుకొని పౌడర్ గా చేసిపెట్టుకోవాలి. ప్రతిరోజు ఉదయం ఈ మిశ్రమాన్ని ఒక స్పూన్ తీసుకొని గ్లాస్ నీటిలో వేసుకుని ఉడక పెట్టుకొని తాగాలి.. ఒకవేళ ఈ మిశ్రమంలో టేస్ట్ కావడం కోసం తేనె వేసుకొని తాగవచ్చు. ఇలా చేయడం ద్వారా శరీరంలో ఉన్న అదనపు బరువు సులువుగా తగ్గించుకోవచ్చు. ఇక లవంగం, టీ ప్యాకెట్ లు ప్రస్తుతం మార్కెట్లో కూడా లభిస్తున్నాయి. అంతే కాకుండా రోజుకు రెండు, మూడు సార్లు లవంగం టీ తాగితే కూడా చాలా మంచిది అని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: