నిజాముద్దీన్ మత ప్రార్ధనలకు భారీగా విదేశీయులు  రావడంతో ఢిల్లీ ఇప్పుడు తగిన మూల్యం చెల్లించుకుంటుందని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. కొద్దీ సేపటికి క్రితం నేషనల్ మీడియాతో మాట్లాడిన కేజ్రీవాల్ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం రోజు రోజు కి ఢిల్లీలో కరోనా కేసులు ఎక్కువవుతుండడం తో రేపటి నుండి లాక్ డౌన్ లో కేంద్రం ఇచ్చిన సడలింపులకు ఢిల్లీ లో మాత్రం ఎలాంటి మినహాయింపులు ఉండవని పూర్తి లాక్ డౌన్ అమలు లో ఉంటుందని  కేజ్రీవాల్ అన్నారు.
 
వారం తరువాత పరిస్థితిని సమీక్షించి లాక్ డౌన్ విషయంలో మళ్లీ నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. అలాగే నిన్న నమోదైన 186 కేసుల్లోఒక్కరికి కూడా  కరోనా లక్షణాలు లేకోపోయినా పాజిటివ్ రావడం ఆందోళన కలిగిస్తుందని అయితే ప్రజలు ఎవరు భయాందోళన చెందవద్దు.. కరోనా కట్టడికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు  కేజ్రీవాల్ వెల్లడించారు. ఇక ఇప్పటివరకు ఢిల్లీ లో కరోనా కేసుల సంఖ్య 1893 కు చేరుకుంది. 
 
ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే కరోనా ప్రభావం ఏ మాత్రం తగ్గడం లేదు. అయితే ఆంధ్రా లో గ్రీన్ జోన్ లలో రేపటి నుండి కేంద్రం ఇచ్చిన సడలింపులు అమలులోకి రానున్నట్లు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వెల్లడించారు. ఇక  తెలంగాణ లో ఈరోజు కేబినెట్ భేటీ జరుగనుంది. ఈభేటీలో కరోనా నివారణ , లాక్ డౌన్ సడలింపులపై ప్రధాన చర్చ జరుగనుంది. అయితే లాక్ డౌన్ విషయంలో తెలంగాణ కూడా ఢిల్లీ బాటలోనే  పయనించేలా కనిపిస్తుంది. మినహాయింపులు ఇస్తే  కేసులు ఇంకా పెరిగే ప్రమాదం వుండడం తో మే 3వరకు  పూర్తి లాక్ డౌన్ ను అమలు చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: