చైనా..ఈ దేశాన్ని ఇపుడు ప్రపంచం యావత్తూ తలచుకుంటోంది. కరోనా మహమ్మారిని అందరికీ పరిచయం చేసిన దేశంగా చైనా కళ్ళ ముందు కనిపిస్తోంది.  చైనా కావాలని చేసిందా లేక వేరేగా జరిగిందా అన్నది పక్కన పెడితే చైనా మీద ఒక్కసారిగా అందరికీ అనుమానాలు ఎక్కువగానే  పెరిగిపోతున్నాయి.

 

ఇదిలా ఉండగా చైనాలో కరోనా కేసులు 86 వేల వరకూ న‌మోదు అయ్యాయి. కానీ మరణాలు మాత్రం కేవలం 3,400 వరకే చూపించారు. తాజగా సవరించి మరో వేయి కలిపారు. అది వేరే విషయం. కానీ కరోనా పుట్టిన గడ్డన అంత తక్కువగా మరణాలు నమోదు కావడం అంటే వింతలో కెల్లా వింతేనని అంటున్నారు.

 

ఈ విషయాన్ని కూడా ఎవరూ నమ్మడంలేదు. దీని మీద ప్రత్యర్ధి, చైనాని నిత్యం దుమ్మెత్తి పోసే అమెరికా నిజ నిర్ధారణ చేసిందంట. ఆ నిజ నిర్ధారణలో భయంకరమైన నిజాలు బయటకు వచ్చాయట. అదేంటి అంటే చైనాలో మరణాలు కనీసంగా 21 వేలుగా అమెరికా ఇంటలిజెన్స్ తేల్చేసింది.

 

దానికి పక్కా ఆధారాలు కూడా చూపిస్తోంది. చైనాలో సెల్ ఫోనులు 21 వేల వరకూ రద్దు అయ్యాయట. అవి కూడా ఈ మూడు నెలల కాలంలోనే. చైనాలో సెల్ ఫోన్ అంటే దానికి ఎంతో విలువ ఉంటుంది. అది ఒక పౌరుడితో సమానం. చైనా పౌరుడికి చెందిన పూర్తి సమాచారం ఆ సెల్ ఫోన్ లో నిక్షిప్తం అయి ఉంటుంది. 

 

ఆ విధంగా దాని డేటా సేకరించి ఒక్కో పౌరుడికి హెల్త్ కోడ్ ఇస్తారు. ఆ విధంగా హెల్త్ కోడ్ తో చైనా కరోనా ఎవరికి వచ్చిందో లేదా తెలుసుకుంటూ వచ్చింది. ఇక రెడ్ సిగ్నల్ వస్తే కరోనా డేంజర్లో ఉన్నాడని, ఎల్లో సిగ్నల్ వస్తే కరోనా సోకే దశలో ఉన్నాడని, గ్రీన్ సిగ్నల్ వస్తే ఆరోగ్యంగా ఉన్నాడని కూడా అర్ధమట.

 

ఈ విధంగా 2010 నుంచే హెల్త్ కోడ్ ని సెల్ ఫోన్ నంబర్ల ద్వారా ఇస్తూ పౌరుల పూర్తి డేటాను చైనా ఉంచుకుంది. ఇపుడు ఒక్కసారిగా 21 వేల సెల్ ఫోన్లు లేకుండా పోయాయని, అవి రద్దు అయ్యాయని కూడా అమెరికా ఇంటలిజెన్స్ గుర్తించింది. అంటే ఆ పౌరులంతా కూడా కరోనా బారిన పడి మరణించారని అమెరికా లెక్క వేసింది. 

 

ఈ వివరాలు చెప్పకుండా చైనా దాచేస్తోంది అని అమెరికా గట్టిగానే తగులుకుంటోంది. అయితే చైనా మాత్రం యధా ప్రకారం తమ దగ్గర ఉన్నవే అసలైన లెక్కలు అని, తాము మరణాలు దాచడంలేదని చెప్పుకుంటోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: