దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ వైరస్ ను కట్టడి చేయడంలో కేరళ వైద్యులు సక్సెస్ అవుతున్నారు. కరోనా వైరస్ ను సమర్థవంతంగా ఎదుర్కొంటూ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. రాష్ట్రంలో కొత్త కేసులు నమోదు కాకుండా చర్యలు తీసుకోవడంతో పాటు... ఇప్పటికే కరోనా భారీన పడిన వారికి మెరుగైన వైద్యం అందించి వారి ప్రాణాలను కాపాడుతున్నారు. 
 
ఫలితంగా దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా గత కొన్ని రోజుల నుంచి కేరళ రాష్ట్రంలో అతి తక్కువ కేసులు నమోదవుతున్నాయి. మరణాల సంఖ్యలో కూడా ఇతర రాష్ట్రాలతో పోలిస్తే కేరళలో తక్కువ సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు కేరళలో ఇద్దరు మాత్రమే కరోనా భారీన పడి మృతి చెందారు. ఇప్పటివరకు ఇక్కడ 218 మంది కోలుకున్నారు. ఇదే ఈ రాష్ట్రంలో వైద్యులు సాధించిన విజయంగా చెప్పవచ్చు. 
 
మన దేశంతో పాటు ప్రపంచ దేశాలు కూడా కేరళ వైద్యులను ప్రశంసిస్తున్నాయి. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఇక్కడ రికవరీ రేటు పెద్దఎత్తున ఉంది.   రాష్ట్రంలో మూడంచెల విధానం ద్వారా ప్రభుత్వం, వైద్యుల సమిష్టి కృష్టితో కరోనా వ్యాప్తి చెందకుండా చేయడంలో సక్సెస్ అయ్యారు. గతంలోనే కేరళ వైద్యులు నిఫా, సార్స్ లాంటి వైరస్ లను కట్టడి చేయడంలో ఇక్కడి వైద్యులు సక్సెస్ అయ్యారు. 
 
దేశంలో మొదట కరోనా కేసులు కేరళలోనే నమోదు అయ్యాయి. కేరళ వైద్యులు మెరుగైన చికిత్స అందిస్తూ కరోనా బాధితులను కోలుకునేలా చేయడంతో పాటు రోగ నిరోధక శక్తిని పెంచడంలో సక్సెస్ అవుతున్నారు. సామాజిక దూరం పాటించడంతో పాటు కరోనా నుంచి కోలుకున్నవారు కొన్ని రోజులు విడిగా ఉండాలని సూచిస్తున్నారు. కోలుకున్న వారికి మరలా కరోనా సోకే అవకాశం ఉందని చెబుతున్నారు.          

మరింత సమాచారం తెలుసుకోండి: