మొదటి విడత లాక్ డౌన్ ను ప్రకటించే సమయానికి భారత్ లో ఉన్న కేసుల సంఖ్య దాదాపు 500. ఇక ఏప్రిల్ 14 విధించిన లాక్ డౌన్ కి 10 వేల కేసుల వరకు నమోదు కావడం గమనార్హం. అంటే దాదాపు 20 రెట్లు ఎక్కువగా కేసులు మధ్యకాలంలో నమోదయ్యాయి. కరోనా వ్యాప్తి చాలా వేగంగా జరుగుతోందని ఇప్పటికీ మనకు అర్థం అవుతుంది. దీంతో మే 3 వరకు ప్రధాని నరేంద్ర మోడీ లాక్ డౌన్ ను పొడిగించిన విషయం తెలిసిందే. ఇక ఒక్క వారం రోజుల్లోనే మరొక ఐదు వేల కేసులు అనగా మొత్తం 15 వేల కేసులు నమోదు కావడం గమనార్హం.

 

మనం లాక్ డౌన్ పొడిగించడం.... కేసుల విషయంలో ఏమాత్రం తేడా రాకుండా అంతకంతకూ పెరుగుతూ ఉండడం చాలా కామన్ అయిపోయింది. లాక్ డౌన్ కొనసాగించడం వల్ల కరోనా వ్యాప్తి భారీగా తగ్గి కేసులు నమోదు లో కూడా తేడా వస్తుందని కేంద్రం ఆశించింది కానీ కొత్త కేసులు ఎప్పటికప్పుడు పెరుగుతూ ఉండడం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాప్తి నిరోధించడంలో విఫలమవుతూ ఉండడం ఇప్పుడు అందరినీ కలవరపరుస్తోంది.

 

ఇదంతా చాలదన్నట్టు ఆంధ్రప్రదేశ్ సహా బెంగాల్ మరియు ఈశాన్య రాష్ట్రాలు లాక్ డౌన్ నుంచి సడలింపులు రేపటి నుంచి ఇస్తున్నాయి. దీనితో పరిస్థితి మరింత దారుణంగా తయారయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. నేపథ్యంలోనే లాక్ డౌన్ విషయంలో తర్జనబర్జన పడుతున్న కేంద్రం తాజాగా మే 3 తర్వాత కూడా లాక్ డౌన్ పొడిగించే అవకాశాలున్నట్టు కనిపిస్తోంది. కేసుల సంఖ్య ఇలానే పెరిగితే మే చివరి వరకు కూడా లాక్ డౌన్ పొడిగించడం తప్ప కేంద్రానికి మరో మార్గం లేకుండాపోయే అవకాశం ఉంటుంది.

 

కాబట్టి కనీసం మరో వారం వరకూ లాక్ డౌన్ పొడిగించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే రోజురోజుకీ ఆర్థిక పరిస్థితి క్షీణిస్తుందిగా.

మరింత సమాచారం తెలుసుకోండి: