ప్రస్తుతం భారత దేశమంతటా లాక్ డౌన్ కొనసాగుతుందని మనందరికీ తెలుసు. అయితే లాక్ డౌన్ అకస్మాత్తుగా అమల్లోకి వచ్చిన తర్వాత వేర్వేరు ప్రదేశాలలో చిక్కుకుపోయిన కూలీలు, భార్యలు, భర్తలు వారి ఇంటికి వెళ్ళలేక నరకం అనుభవిస్తున్నారు. ప్రత్యేకంగా లాక్ డౌన్ కారణంగా దూరంగా ఉండాల్సిన పరిస్థితి వచ్చిన భార్య భర్తలు ఒకరిని ఒకరు చూడకుండా అస్సలు ఉండలేకపోతున్నారు. ఒక వింతైన సంఘటన గురించి చెప్పుకుంటే... కొత్తగా పెళ్లైన భర్త యొక్క భార్య లాక్ డౌన్ అమలుకు ముందు తన పుట్టింటికి వెళ్లిపోయింది. ఆ క్రమంలోనే లాక్ డౌన్ ప్రకటించే సరికి అన్నీ ప్రజా రవాణా వాహనాల ప్రయాణాలు నిషేధించడంతో ఆమె తన భర్త దగ్గరకు రాలేకపోయింది. భర్త ఎన్నిసార్లు ఫోన్ చేసి పిలిచినా... నాలుగు రోజులు ఓపిక పట్టుకోండి అని భార్య సర్ది చెప్పేది. సరే, సరే అని సమాధానం ఇచ్చిన భర్త... ఒకరోజు ఆమెకు పెద్ద షాక్ ఇచ్చాడు.


పూర్తి వివరాలు తెలుసుకుంటే... బీహార్ రాష్ట్రంలోని పాలీగంజ్ పట్టణానికి చెందిన ధీరజ్ కుమార్ ఓ యువతిని కొన్ని నెలల క్రితం పెళ్లి చేసుకున్నాడు. ఐతే లాక్ డౌన్ విధించక ముందు అతడి భార్య తన పుట్టింటికి వెళ్లిపోయింది. అనంతరం ఆమె తన భర్త వద్దకు రావడానికి శత విధాలుగా ప్రయత్నించినా వీలు పడలేదు. మరోవైపు తన భర్త తనని ఇంటికి రమ్మని కోరుతూ గట్టిగా పట్టుబట్టాడు. కానీ భార్య మాత్రం అత్తారింటికి రాలేకపోయింది. దాంతో భార్య లేకపోతే ఏంటి నా ప్రియురాలి దగ్గరలోనే ఉంది కదా అనుకున్నా ఆ కామాంధుడు వెంటనే ఆమెకు ఫోన్ చేయడం ప్రారంభించాడు. మాటా మాటా కుదరడంతో ఇద్దరు శారీరకంగా కలిసి పోయారు. ఒకానొక రోజు ఆమెను ఏకంగా పెళ్ళికూడా చేసుకున్నాడు.


ఈ విషయం కాస్త మొదటి భార్యకు తెలియడంతో... ఆమె తీవ్ర ఆగ్రహానికి గురైంది.  పోలీస్ స్టేషన్ కి వెళ్లి తన భర్త పై ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు... ధీరజ్ కుమార్ ని అరెస్టు చేసి తమదైన శైలిలో విచారిస్తున్నారు. విచారణలో ధీరజ్ కుమార్ తన భార్యను అయిష్టంగానే వివాహమాడాడని, భార్య లాక్ డౌన్ కారణంగా దూరంగా ఉన్న సమయంలో తన ప్రేయసి కి బాగా దగ్గరైపోయి పెళ్లి చేసుకున్నాడని తేలింది.



మరింత సమాచారం తెలుసుకోండి: