చంద్రబాబు అంటే ఎలాంటి నాయకుడు. జాతీయ నేత. ఇంకా చెప్పాలంటే బిల్ క్లింటన్ వంటి వారితో దోస్తీ చేసిన అంతర్జాతీయ నాయకుడు. నలభయ్యేళ్ళ రాజకీయ  చరిత్ర, పార్టీ పెట్టిన అన్న గారి కంటే కూడ ఎక్కువ సార్లు సీఎంగా, పార్టీ ప్రెసిడెంట్ గా పనిచేసిన ఘనత బాబు సొంతం.

 

మరి అటువంటి బాబు పుట్టిన రోజు వేడుకలు వరసగా మూడేళ్ళ నుంచి సరిగ్గా జరగడంలేదు. 2018 నుంచి బాబుకు బర్త్ డే బాగా దెబ్బకొట్టేస్తోంది. ఆనాడు ఆయన మోడీతో పేచీ పెట్టుకుని ప్రత్యేక  హోదా అంటూ పుట్టిన రోజు పూటా పస్తులు ఉన్నారు.

 

రోజంతా దీక్ష చేస్తూ మోడీని తిట్టడంతోనే కడుపు నింపుకున్నారు. ఇక గత ఏడాది అంటే 2019 ఎన్నికల  ఏడాది, అప్పటికి ఎన్నికలు జరిగిపోయి ఫలితాలు కూడా కళ్ళ ముందు కనిపిస్తున్న సందర్భం. పైగా ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. దాంతో బాబుకు పుట్టిన రోజు సవ్యంగా జరగలేదు.

 

తూతూ మంత్రంగానే జరిపేసుకున్నారు. పోనీ ఈ ఏడాది అయినా ఘనంగా జరుగుపుకుని క్యాడర్ కి ఉత్సాహం ఇద్దామనుకుంటే కరోనా పుణ్యమాని ఇంట్లోనే ఉండాల్సివవస్తోంది. 

 

దాంతో ఏప్రిల్ 20 బాబు పుట్టిన రోజు వేడుకలు ఆయన ఇంట్లో ఆయనే స్వయంగా కేక్ కట్ చేసుకోవం ద్వారా ముగిస్తారు. ఇక బాబుని ఫోన్ల ద్వారానే పార్టీ నాయకులు అభినందిస్తారన్నమాట.

 

బాబు ఈ ఏడాదితో 70 ఏళ్ళు పూర్తి చేసుకుని 71 ఏట అడుగుపెడుతున్నారు. ఏప్రిల్ 20, 2020 మంచి క్యాచీగా యియర్ కలసింది. కానీ బర్త్ డే చేసుకోవడానికి మాత్రం చాన్స్ లేదు. పాపం ఏడు దశాబ్దాలు పూర్తి చేసుకున్న శుభవేళ బాబుకు ఇది నిజంగా చాలా లోటే. కానీ ఏం చేస్తాం. బయట కరోనా పొంచి ఉంది. అందుకే ఏ వేడుకలు అయినా గప్  చిప్ గానే జరిగిపోవాలంతే.

 

మరింత సమాచారం తెలుసుకోండి: