క‌రోనా కోర‌లు చాచింది. ఇది ప్రాణాంత‌క వ్యాధి కావ‌డంతో ప్ర‌తి ఒక్క‌రూ చాలా జాగ్ర‌త్త‌గా ఉండాల‌న్న విష‌యం ఎప్ప‌టి కప్పుడు ఇటు ప్ర‌భుత్వాలు, అటు సెల‌బ్రెటీలు ప్ర‌తి ఒక్క‌రూ కూడా చెబ‌తున్నారు. అంద‌ర్నీ కూడా ఎంతో నిబ‌ద్ధ‌త‌తో ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల‌ను కాపాడుకుంటుంది. ఇక ఇదిలా ఉంటే... 


అసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ఓ వ్య‌క్తికి క‌రోనా రావ‌డంతో ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌డం అక్కడివారంద‌రినీ ఈ ఘ‌ట‌న‌ కలకలం రేపింది. ఢిల్లీ నిజాముద్దీన్‌లో మర్కజ్ మత ప్రార్థనల ఘటన రాష్ట్రంలో అలజడి రేపిన విష‌యం తెలిసిందే. అసిఫాబాద్ జిల్లా నుంచి కూడా ఈ మత ప్రార్థనలకు పలువురు వెళ్లొచ్చినట్లు అధికారులు చెబ‌తున్నారు. అయితే  వీరందరినీ కూడా జిల్లా కేంద్రంలోని ఆస్పత్రిలో క్వారంటైన్‌కు తరలించారు. అయితే.. శనివారం (ఏప్రిల్ 18) ఆ కేంద్రంలో ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.

 

దీంతో ఆ యువకుడు భయంతో తనను వేరే వార్డుకు తరలించాలని అధికారులను కోరాడు. అధికారులు తన గోడు వినడం లేదంటూ.. వార్డులోనే ఉన్న ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. అది గమనించిన వైద్య సిబ్బంది, అధికారులు అతడికి నచ్చజెప్పి మరో చోటుకి తరలించారు.
అసిఫాబాద్ జిల్లాలో మొత్తం ఐదు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అయితే వీరిలో ఓ ఐదేళ్ల చిన్నారి కూడా ఉండ‌టం చాలా విచార‌క‌ర‌మైన విష‌యం. గ్రేటర్ హైదరాబాద్ తర్వాత ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే కరోనా కేసులు చాలా ఎక్కువ‌గా నమోదయ్యాయి. దాంతో రాష్ట్రంలో నమోదైన కేసుల్లో 70 శాతం ముస్లింలు మర్కజ్ మ‌త ప్రార్ధ‌న‌లకు వెళ్ళివ‌చ్చిన‌వారే ఉన్నారు. శనివారం రాత్రికి రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 809కి పెరిగింది. వీరిలో 186 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.  అయితే మిగిలిన 18 మంది మరణించారు. దీంతో ఎక్క‌డ చూసినా క‌రోనా క‌ల‌క‌లం బాగా ఎక్కువ‌యిపోయింది. దీంతో కొంత మంది తొంద‌ర‌పాటు నిర్ణ‌యాలు తీసుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: