ప్రస్తుతం కరోనా వైరస్ మన తెలుగు రాష్ట్రాలలో చాపకింద నీరులాగా విజృంభిస్తుంది అనే చెప్పాలి. ఇటు తెలంగాణలో హైదరాబాద్ లో ఎక్కువ సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి  రోజు రోజుకి. అలాగే ఇటు ఆంధ్రప్రదేశ్లో కర్నూలు జిల్లాలో రోజురోజుకీ పాజిటివ్ ల సంఖ్య అమాంతంగా పెరిగి పోతుంది. ఇప్పటికీ 158 కేసులు నమోదయ్యాయి.  వీటిలో కూడా కర్నూల్ పట్టణంలోనే 60కి పైగా  కేసులు నమోదైనట్లు  సమాచారం. 

 


ఇప్పటి వరకు కర్నూలు జిల్లాలో నలుగురు మృత్యువాతపడ్డారు. నేడు  ఒక వృద్ధుడు చనిపోయినట్లు సమాచారం. రోజురోజుకు పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తో ప్రజలు భయాందోళనలతో జీవిస్తున్నారు.  ఇక వివరాల్లోకి వెళితే కర్నూలు పట్టణంలోని మేదరి వీధికి చెందిన ఒక వృద్ధుడికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అవ్వడం జరిగింది. ఆ వృద్ధుడికి సర్వజన హాస్పిటల్లో చికిత్స అందజేస్తున్నారు.. చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి చెందినట్లు కర్నూలు జిల్లా కలెక్టర్ వీరపాండియన్‌ తెలియజేయడం జరిగింది. దీనితో పాటు ఆ వృద్ధుడికి అనారోగ్య సమస్యలు కూడా ఉన్నట్లు తెలిపారు.  ఇక ఈ మృత్యువుతో జిల్లాలో ఇప్పటి వరకు మొత్తం కరణం మృతుల సంఖ్య 5 అయ్యింది. 

 


ఆదివారం ఒక్కసారిగా 26 మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు నిర్ధారణ అవ్వడం జరిగింది. ప్రస్తుతం జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 158 చేరుకుంది.. ఇప్పటివరకు కరోనా బారినుండి బయటపడి ఒక్కరు డిశ్చార్జ్ అయ్యారు. ఇక మిగిలిన వారందరికీ కరోనా వైరస్ హాస్పిటల్లో వైద్య అధికారులు చికిత్సలు అందజేస్తున్నారు. ఇక కర్నూలు నగరంలో.. ముఖ్యంగా వన్ టౌన్ ప్రకాష్ నగర్ ఎం ఆర్ పెట్ పూజా విధి ఏరియాలలో కరోనాకేసులు ఎక్కువగా నమోదు  అవుతున్నాయి అనే చెప్పాలి. ఇక ఇప్పటి వరకు కర్నూలు పట్టణంలో 30 ఏరియాలలో రెండు జోన్లుగా అధికారులు ప్రకటించారు. అంతేకాకుండా కర్నూలు జిల్లా నంద్యాల పట్టణంలో కూడా పరిస్థితి భయాందోళనలు గా మారిందనే చెప్పాలి. ప్రజలు అందరు కూడా ఇంట్లో నుంచి బయటకు రావద్దు అని అధికారులు హెచ్చరిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: