అమెరికాపై కరోనా చేస్తున్న యుద్ధం ఇప్పట్లో ముగిసేలా లేదు. రోజు రోజుకి కరోనా బారిన పడి మృతి చెందుతున్న వారి సంఖ్య అంచనాలకి కూడా అందటం లేదు. ప్రస్తుతం కరోనా కారణంగా మృతి చెందిన అమెరికన్స్ మొత్తంగా 40వేలకి చేరువలో ఉన్నారు..బాధితుల సంఖ్య 7.50 లక్షలకి చేరుకుంది. ఈ పరిస్థితులో అమెరికాకి  నిరుద్యోగం తోడయ్యింది వెరసి అమెరికా ఆర్ధిక పరిస్థితి కుదేలయింది. ఇదిలాఉంటే తాజాగా అమెరికాలో జరగబోయే అధ్యక్ష ఎన్నికలు హాట్ టాపిక్ అయ్యాయి..

IHG

 

అమెరికా అధ్యక్షుడిని నవంబర్ లో ఎన్నుకోవాల్సిన సమయం వచ్చేస్తోంది. దాంతో ఈ ఎన్నికలు నవంబర్ లో జరుగుతాయా అనే సందేహం అమెరికా ప్రజలలో కలుగుతోంది. కరోనా ప్రభావంతో ఇప్పటికే దాదాపు 15 రాష్ట్రాలలో జరగాల్సిన ప్రైమరీ  ఎన్నికలు వాయిదా పడ్డాయి. దాంతో నవంబర్ లో జరగబోయే అధ్యక్ష ఎన్నికలపై సందిగ్ధత నెలకొంది. ఒక వేళ నిజంగా ఎన్నికలని వాయిదా వేయాలంటే డెమోక్రటిక్ పార్టీ రిపబ్లికన్ పార్టీల మధ్య సదాభిప్రాయం రావాలి..కానీ పరిస్థితులు అలా కనిపించడం లేదు..ఒక వేళ ఎన్నికలు వాయిదా వేసినా ట్రంప్ తనకి ఉన్న కాలపరిమితి ప్రకారం 2021 జనవరికి ముగుస్తుంది..తరువాత గెలిస్తే ఒకే లేకపోతే  జో బిడెన్ అధ్యక్షుడిగా కొనసాగుతారు..ఇదిలాఉంటే..

IHG't cancel or postpone the <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=NOVEMBER' target='_blank' title='november-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>november</a> <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=ELECTION' target='_blank' title='election-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>election</a> over ...

ఒక వేళ ఎన్నికలు వాయిదా పడితే..రూల్స్ ప్రకారం అధ్యక్ష వారసత్వం అమలులోకి వస్తుంది కానీ ఉపాధ్యక్షుడిగా ఉన్న మైక్ పెన్స్ కూడా అదే సమయంలో పదవీ విరమణ పొందనున్నారు.అయితే ఆ తరువాత అధ్యక్ష పీటం అధిరోహించే అవకాశం ప్రతినిధుల సభ స్పీకర్ కి మాత్రమే దక్కుతుంది. కానీ డెమోక్రటిక్ నేత అయిన ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ ఫెలోసీ డిసెంబర్ లో పదవీవిరమణ చేయనున్నారు. దాంతో ఆమెకి కూడా అవకాశం దక్కదు..ఆ తరువాత స్థానంలో రిపబ్లికన్ పార్టీ నేత ప్రోటెం ప్రెసిడెంట్ ఉన్నారు కానీ ఆయన కూడా పదవీ విరమణ కాలానికి దగ్గరగా ఉన్నారు. దాంతో ఎన్నికలు వాయిదా పడితే ఎవరు అధ్యక్షుడు అవుతారు అనే ప్రశ్న అందరిలో పెద్ద చర్చనీయంసం అయ్యింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: