ఎవరు ఎటు పోతేనేం.... భయట ఏమైతే మాకేంటి..? ఇదే వైఖరిలో ఉన్నారు విద్యాసంస్ధల యాజమాన్యాలు. దేశమంతటా... లాక్ డౌన్ తో ఆర్ధికంగా అంతా కుదేలై ఉంటే... ఫీజులు కట్టండని మెసేజ్ లు. మెసేజ్ లు పెడితే పెట్టారు. కానీ ఫీజులు కూడా పెంచేశాం అంటూ సమాచారం అందించటంతో తల్లిదండ్రులకు చిర్రెత్తిపోతున్నారు. స్కూళ్లన్నీమూత పడినా... వాటి ఫీజులు కూడా కట్టండని ఎస్ ఎం ఎస్ లు పంపడం అంటే...కార్పోరేట్ స్కూళ్ల కక్కుర్తి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు.

 

కరోనా లాక్ డౌన్ ఎఫెక్ట్ విద్యా రంగంపై పూర్తి స్థాయిలో ఉంది .కేజీ టూ పీజీ విద్యా సంస్థలు లాక్ డౌన్ తో క్లాస్ ల నిర్వహణను నిలిపివేశాయి . కొన్ని విద్యా సంస్థలు మాత్రం అన్ లైన్ లో స్టూడెంట్స్ కు క్లాస్ లు చెబుతున్నాయి. స్కూల్స్ లో కొత్త అకాడమిక్ ఇయర్ స్టార్ట్ కాలేదు .మరో వైపు లాక్ డౌన్ ఎఫెక్ట్ వివిద రంగాల్లో ఉన్నవారిపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. కొన్ని రంగాల్లో జీతాల కోత... మరికొన్ని రంగాల్లో ఉద్యోగుల తొలగింపు జరిగిపోతున్నాయి. హైదరబాద్ లోని పలు ఇంటర్ నేషనల్ స్కూల్స్ తో పాటు ఇతర స్కూల్స్ లు ఫీజులు కట్టాలని మెసేజ్ లు పంపుతున్నారని పలువురు పేరెంట్స్ అంటున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని స్కూల్స్ మేనేజ్ మెంట్ లు వ్యవహరించాలని హైదరాబాద్ పేరెంట్స్ అసోసియేషన్ డిమాండ్ చేస్తోంది.

 

ప్రతీ ఏడాదిలాగే పలు స్కూల్స్ ఫీజులను పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. ఒక్కో స్కూల్ స్థాయిని బట్టి ...ఫీజులు పెంచినట్టు పేరెంట్స్ అంటున్నారు. కరోనా ప్రభావం మరికొంత కాలం ఉండే అవకాశం ఉంది కాబట్టి ...ఫీజుల పెంపు నిర్ణయంను స్కూల్స్ వాయిదా వేసుకోవాలని కోరుతున్నారు. మార్చి చివరి వారం మొదలు...ఏప్రిల్ నెల అంతా స్కూల్స్ నడవలేదు కాబట్టి ట్రాన్స్ పోర్ట్ చార్జీలు వసూలు చేయవద్దని కొరుతున్నారు .డిల్లీ ప్రభుత్వం స్కూల్ ఫీజుల విషయంలో ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది ...ఇక్కడ కూడా ప్రభుత్వం అటువంటి నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు .టర్మ్ ఫీజును విషయంలో కూడా పేరెంట్స్ పై ఒత్తిడి చేయావద్దని కోరుతున్నారు.

 

కేంద్ర మానవ వనరుల అభివృద్ది శాఖ ఫీజుల పెంపు వద్దని స్కూల్స్ కు సూచించాయి. ఇటు దేశ వ్యాప్తంగా పలు పేరెంట్స్ అసోసియేషన్ స్కూల్స్ ఫీజుల పెంపు విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లాయి. ఇటు తెలంగాణలో కూడా హైదరబాద్ స్కూల్స్ పేరెంట్స్ అసోషియేషన్ ఫీజుల పెంపు అంశంను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాయి.మరి స్కూల్స్ ఏ విధంగా స్పందిస్తాయో చూడాల్సి ఉంటుంది .

 

మరింత సమాచారం తెలుసుకోండి: