తెలంగాణ‌లో లాక్‌డౌన్‌ను మే 7 వరకు లాక్‌డౌన్ పొడిగించనున్నట్లు తెలుస్తోంది. ఈమేర‌కు ముఖ్య‌మంత్రి కేసీఆర్ సంచ‌ల‌నాత్మ‌క నిర్ణ‌యం తీసుకుంటున్న‌ట్లుగా స‌మాచారం అందుతోంది. ఇప్ప‌టికే రెండోసారి మే3 వ‌ర‌కు లాక్‌డౌన్ పెంచుతూ కేంద్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకున్న విష‌యం తెలిసిందే. అయితే రాష్ట్రంలో క‌రోనా వ్యాప్తి అధిక‌మ‌వుతున్న వేళ‌...క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఇంకా పెరుగుతున్నందున జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించాల‌ని ముఖ్య‌మంత్రి భావించిన‌ట్లు స‌మాచారం. లాక్‌డౌన్ విష‌యంలో కేంద్రం ప్ర‌భుత్వం స‌డ‌లింపు ఇవ్వాల‌నుకుంటున్న తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం మాత్రం ఆచితూచి వ్య‌వ‌హ‌రిస్తున్న‌ట్లుగా తెలుస్తోంది.

 

 ఒక్క‌సారి స‌డ‌లింపు ఇవ్వ‌డం వ‌ల‌ను జ‌నాలు క‌ట్ట‌దాటిపోతార‌నే యోచ‌న‌లో ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఉన్న‌ట్లుగా తెలుస్తోంది. కేంద్ర ప్ర‌భుత్వం జారీ చేసిన ప‌లు అంశాల‌పై ఆదివారం మ‌ధ్యాహ్నం కేబినేట్‌లో విస్తృత స్థాయి చ‌ర్చ జ‌రిగింది. ఈ చ‌ర్చ‌లో కేంద్ర ప్ర‌భుత్వం జారీ చేయాల‌నుకుంటున్న వాటిపై కూడా కొన్ని ఆంక్ష‌లు విధించాల‌ని కేసీఆర్ ప్ర‌భుత్వం  భావిస్తోంది. పైగా తెలంగాణలో లాక్‌డౌన్‌ను పొడిగించే యోచనలో సీఎం కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది. 3 నెలల పాటు అద్దె రుసుం విషయంలో యజమానులు ఒత్తిడి చేయకుండా ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉంది. రాష్ట్రంలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది. 


ఫుడ్ డెలివరీకి ఇచ్చిన అనుమతులను కూడా పూర్తిగా రద్దు చేయనున్నట్లు సమాచారం. కూలీలు, పేదలు, వలస కార్మికుల కోసం ఆహారం పంపిణీ చేయడానికి పలు స్వచ్ఛంద సంస్థలు, ఇతరులు చేస్తున్న కార్యక్రమాలకు ముందస్తు అనుమతి తీసుకోవాలని ఇప్పటికే రాష్ట్ర ప్ర‌భుత్వం ఆదేశాలు జారీ చేసిన విష‌యం తెలిసిందే. అలాగే జ‌లుబు, ద‌గ్గు, జ్వ‌రం అంటూ మెడిక‌ల్ షాపుల‌కు వ‌చ్చిన వారికి వైద్యుల ప్రిస్కిప్ష‌న్ లేకుండా మందులు ఇవ్వ‌కూడద‌ని ఆదేశించింది. దీని వ‌ల్ల క‌రోనా ల‌క్ష‌ణాలు ఉన్న‌వారికి తాత్క‌లికంగా ఉప‌శ‌మ‌నం క‌లిగి ఆస్ప‌త్రికి రావ‌డం లేద‌ని వైద్యులు సూచించ‌డం ప్ర‌భుత్వం ఈ నిర్ణ‌యం తీసుకుంది.  ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన ఆదివారం మధ్యాహ్నం ప్రారంభమైన మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. స‌మావేశం అనంత‌రం ముఖ్య‌మంత్రి మీడియాతో మాట్లాడ‌నున్నారు. అప్పుడే పూర్తి స్ప‌ష్ట‌త రానుంది.

 


క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: