భార‌త్‌లో క‌రోనా త‌న ప్ర‌తాపాన్ని చూపిస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కు భార‌త్‌లో 507మంది చనిపోయినట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ ప్రకటించారు.ఆదివారం  ఒక్కరోజే 27 మంది ప్రాణాలు కోల్పోయినట్టు తెలిపారు.  ఇదిలా ఉండ‌గా   కేవ‌లం 24 గంటల వ్యవధిలోదేశంలో 1334 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదుకావ‌డం గ‌మ‌నార్హం.  ఇక ఇప్ప‌టి వ‌ర‌కు  దేశంలో న‌మోదైన కరోనా కేసుల సంఖ్య 15,712 కు చేరుకుంది.  ఇప్పటి వరకు 3.86 లక్షల టెస్టులు చేసినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.  అలానే గడిచిన 24 గంటల్లో 37 వేలమందికి కరోనా టెస్టులు నిర్వహించినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.  


కరోనా వైరస్ రోజు రోజుకు దేశంలో విస్తరిస్తోంది. గ‌డిచిన నాలుగు రోజులుగా  రోజుకు కనీసం వెయ్యికి పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి.  టెస్టుల సంఖ్య పెంచడంతో దానికి అనుగుణంగా కరోనా కేసులు కూడా పెరిగిపోతున్నాయి. గత 25 రోజులుగా దేశంలో లాక్ డౌన్ అమలు జరుగుతున్నది.  కరోనా కేసులు ఎంతవరకు తగ్గు ముఖం ప‌ట్టే వరకు దేశంలో లాక్ డౌన్ ఉండే అవకాశం ఉంద‌ని తెలుస్తోంది. మరో నెల‌రోజుల పాటు కొన‌సాగిన ఆశ్చ‌ర్యం లేద‌ని ప‌లువురు వైద్యులు అభిప్రాయం వ్య‌క్తం చేస్తున్నారు. ఇక దేశంలో మ‌హారాష్ట్ర‌,త‌మిళ‌నాడు, తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, గుజ‌రాత్‌, మ‌ధ్య‌ప్రదేశ్‌, రాజ‌స్థాన్‌,ఉత్త‌ర ప్ర‌దేశ్ రాష్ట్రాల్లో క‌రోనా వేగంగా వ్యాపిస్తున్న‌ట్లు న‌మోదవుతున్న కేసుల‌ను బ‌ట్టి అర్థం చేసుకోవ‌చ్చు. 


ఇదిలా ఉండ‌గా  పుదుచ్చేరిలోని మహే, కర్ణాటకలోని కొడగులో గత 28 రోజులుగా ఎలాంటి కరోనా వైరస్ కేసు నమోదు కాలేదు. అలాగే, గత 14 రోజుల కాలంలో 54 జిల్లాల్లో ఎలాంటి కొత్త కేసులు నమోదు కాక‌పోవ‌డం కొంత ఆశాజ‌న‌క‌మైన విష‌య‌మేన‌ని చెప్పాలి.   ప్రపంచవ్యాప్తంగా చూస్తే కరోనా లక్షణాలు లేకపోయినా పాజిటివ్ వచ్చిన వారి సంఖ్య చాలా తక్కువ శాతం ఉందని కేంద్ర వైద్య ఆరోగ్య‌శాఖ అధికారులు చెబుతున్నారు. దేశంలో కరోనా వైరస్ బాధితుల కోసం ప్రత్యేకంగా 755 ఆస్పత్రులు, 1389 ఆరోగ్య కేంద్రాలు సేవలు అందిస్తున్నాయని ల‌వ్ అగ‌ర్వాల్ తెలిపారు. 

 

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: