లాక్ డౌన్ కారణంగా ఏపీలో అత్యవసర సేవలు మినహా మిగతావన్నీ మూతపడ్డాయి. సుదీర్ఘకాలంగా లాక్ డౌన్ కొనసాగుతూ ఉండటం తో రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి ఆదాయం రాకుండా పోతుంది. లాక్ డౌన్ వల్ల రాష్ట్రానికి ఆర్ధిక నష్టం వస్తుందని జగన్ ప్రభుత్వం మొదటి నుంచి చెబుతూనే  ఉంది. కానీ ప్రజల ప్రాణం కన్నా ఏదీ కాదు. అందుకే ఆ కేంద్రం కూడా ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేని పరిస్థితి. అయితే కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 20 నుండి లాక్ డౌన్ పై కొన్ని పరిశ్రమలకు సడలింపు ఇవ్వాలని ఆలోచన చేసిన విషయం అందరికీ తెలిసినదే. ఈ ఆలోచనతో ఏపీ ప్రభుత్వం కాస్త కుదుట పడే అవకాశం ఉంది. కేంద్రం ఆదేశాలను సారంగా కొత్త మార్గదర్శకాలను ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. వాటి ప్రకారం రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో లాక్ డౌన్ నుంచి మినహాయింపు లభించనున్నాయి.

 

ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలు ఈ విధంగా ఉన్నాయి. అత్యవసర వస్తు ఉత్పత్తి పరిశ్రమలకు పరిమిత మినహాయింపులు ఉంటాయి. అలాగే ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం లో ఉన్న పరిశ్రమలు నడిపించు కొనేందుకు అవకాశం ఉంటుంది. ఆర్వో ప్లాంట్ లు ఆహార ఉత్పత్తి పరిశ్రమలకు అదేవిధంగా మందుల తయారీ ప్లాంట్లకు కూడా అనుమతులు ఇవ్వడం జరిగింది. ఇక రైస్, పప్పు మిల్లులు, పిండి మరలు డైరీ ఉత్పత్తి పరిశ్రమలకు, మాస్కులు బాడీ సూట్ లో తయారీ సంస్థలకు, సబ్బుల తయారీ కంపెనీలు, బేకరీ చాక్లెట్ తయారీ పరిశ్రమలకు, ఐస్ ప్లాంట్, సీడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలకు లాక్ డౌన్ నుంచి మినహాయింపు దక్కనుంది. అలాగే రాష్ట్రంలో ఈ కామర్స్ సేవాసంస్థలు అందించవచ్చు. ఇదిలా ఉండగా రాష్ట్రంలో కరోనా వైరస్ సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇలాంటి సమయంలో లాక్ డౌన్ నుండి సడలింపు ఇవ్వటం వల్ల ప్రమాదమే అనే వాళ్ళు ఉన్నారు.

 

లాక్ డౌన్ వల్ల రాష్ట్ర మరియు కేంద్రాలకు ఆదాయం లేకుండా పోయింది. లాక్ డౌన్ ఇలాగే కంటిన్యూ అయితే దేశం తీవ్రంగా ఆర్థిక మాంద్యంలో కి కూరుకుపోయే ప్రమాదం ఉండటంతో కేంద్రం పలు రంగాలకు సడలింపు ఇచ్చింది. రేపటి నుండి కేంద్ర మరియు ప్రభుత్వ ఆఫీసులు తెరవాలని సూచించింది. అత్యవసర సేవల కోసం ప్రైవేటు వాహనాలకు అనుమతి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. తయారీ యూనిట్ లో పరిశ్రమలు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది. నిత్యావసర మరియు అత్యవసర సరుకులు కొనుగోలుకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాల్సి ఉంది. ఏది ఏమైనా ఈ సడలింపు లతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థికంగా కాస్త కుదుటపడే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: