దేశంలో కరోనా వైరస్ రోజురోజుకు వేగంగా విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. రోజురోజుకు బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య పెరుగుతోంది. కరోనా వైరస్ సోకిన వారిలో రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉన్నవారు వైరస్ బారి నుండి సులభంగా బయటపడుతున్నారు. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు మాత్రం చికిత్స అందించినా కోలుకోలేక మృత్యువాత పడుతున్నారు. అందువల్ల వైద్యులు కూడా రోగనిరోధక శక్తి పెంచుకోవడానికి ప్రయత్నించాలని సూచిస్తున్నారు. 
 
కరోనా భారీన పడినా మనల్ని మనం రక్షించుకోవాలంటే రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలి. దేశవ్యాప్తంగా కేంద్రం లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేస్తున్నప్పటికీ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఎవరికివారు కరోనా సోకకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటే మాత్రమే కొత్త కేసులు నమోదయ్యే అవకాశాలు తక్కువని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 
 
కరోనా వైరస్ కు వ్యాక్సిన్, మందు లేకపోవడంతో ఎప్పుడు ఎవరికి సోకుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. కేసుల సంఖ్య రోజురోజుకు తగ్గుతుందని ప్రజలు భావిస్తుండగా ప్రతిరోజూ పదుల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతూ ఉండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రతిరోజూ కేసుల సంఖ్య పెరుగుతూ ఉండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర ఆర్థిక స్థితి తగ్గిపోతూ ఉండగా క్వారంటైన్ కేంద్రాలకు వచ్చే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. 
 
ఒక మనిషి నుంచి ఎక్కువ మందికి వైరస్ సోకుతూ ఉండటంతో ఎప్పుడు ఎవరికి ఎలా సోకుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. కరోనా ధాటికి అగ్ర రాజ్యం అమెరికానే చేతులెత్తేసే పరిస్థితి నెలకొంది. దేశంలో వెంటిలేటర్ల కొరత తీవ్రంగా ఉంది. మనం ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా వైరస్ భారీన పడి చనిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల ప్రజలు కరోనా సోకకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. దేశంలో కరోనా ఉధృతి తగ్గే వరకు బయటకు వెళ్లకుండా ఉంటే మంచిది. 

మరింత సమాచారం తెలుసుకోండి: