ఒక నిరుపేద కుటుంబం నుండి అనేక కష్టాలను ఎదుర్కొని అమెరికా ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యాడు అబ్రహం లింకన్. జీవితంలో అనేక పర్యాయాలు ఓటమి చవిచూసిన అబ్రహం లింకన్, రాజకీయంలో మరియు వ్యాపార రంగంలో కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. అబ్రహం లింకన్ 1809 ఫిబ్రవరి 12 తారీకున జన్మించారు. అబ్రహం తండ్రి పేరు థామ్సన్ లింకన్, తల్లి పేరు నాన్సీ. అయితే తన తల్లి నాన్సీ చిన్నప్పుడే చనిపోవడంతో తండ్రి థామ్సన్ లింకన్ రెండో పెళ్లి చేసుకోవడం జరిగింది. దాంతో అబ్రహం లింకన్ తన తండ్రికి మానసికంగా కొంత దూరంగా ఉండేవారు. లింకన్ కి ఒక అక్క ఒక తమ్ముడు కూడా ఉన్నారు. లింకన్ వాళ్ళ తమ్ముడు చిన్నప్పుడే చనిపోయారు. అబ్రహం లింకన్ కి 20 సంవత్సరాల వయస్సు వచ్చిన టైం లో వాళ్ళ అక్క చనిపోవడం జరిగింది. అటువంటి కష్టాల మధ్య నిరుపేద జీవితాన్ని జీవించిన అబ్రహం లింకన్ కష్టాలలో చదువు పట్ల చాలా శ్రద్ధ చూపించారు.

 

ఎక్కడ నిర్లక్ష్యం వహించకుండా కష్టపడి చదివేవారు. ఒకవైపు చేతికి దొరికిన పని చేసుకుంటూనే మరొకవైపు చదువుకునే వారు. ఒకసారి లింకన్ తన ఫ్రెండ్ దగ్గర లైఫ్ ఆఫ్ వాషింగ్టన్ అనే పుస్తకాన్ని తీసుకోవటం జరిగింది. ఆ పుస్తకంలో అమెరికా మొదటి ప్రెసిడెంట్ వాషింగ్టన్ జీవిత చరిత్ర ఉంది. ఆ పుస్తకాన్ని చదివిన లింకన్ తాను కూడా అమెరికా పరిచయం అవ్వాలని బలంగా నిర్ణయించుకున్నాడు. లింకన్ బాగా కష్టపడి చదివి లాయర్ అయ్యారు. లాయర్ గా ఆయన గొప్పతనాన్ని ఆయన నిరూపించుకున్నారు. ఒకరోజు లింకన్ కోర్టులో కేసు వాదిస్తున్న సమయంలో తప్పు తన క్లయింట్ దే అని తెలిసి కేసు ఓడిపోయినా పర్వాలేదని లింకన్ తన క్లయింట్ వైపు వాదించడం మధ్యలోనే ఆపేశారు. ఇలా లాయర్ గా ఆయన జీవితంలో నిరూపించే సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఈ విధంగా ఎదుగుతున్న లింకన్ రాజకీయాల్లోకి రావడం మెల్లగా మొదలుపెట్టారు.

 

రాజకీయాల్లో రావటమే లింకన్ తన ప్రసంగాల్లో ఎప్పుడూ ఎవరికీ ఎవరూ బానిసత్వం ఉండకూడదని అలాంటి పరిస్థితులు లేకుండా చేస్తానని మాట ఇచ్చేవాళ్ళు. దాంతో 1861 లో అమెరికాకి 16వ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అప్పట్లో ఆ నల్ల జాతీయులను అమెరికా కి సంబంధించిన 11 సంయుక్త రాష్ట్రాల వారు బానిసలుగా చూసేవారు. ఎప్పుడైతే అమెరికా అధ్యక్షుడిగా అబ్రహం లింకన్ ఎన్నిక అవ్వటం జరిగిందో అమెరికాలో తాను పరిపాలించినంత కాలం బానిసత్వం లేకుండా చేశారు. 1865లో రాజ్యాంగ సవరణ ద్వారా పూర్తిగా బానిసత్వాన్ని రూపుమాపారు. లింకన్ బానిసత్వాన్ని తొలగించడానికి ప్రయత్నించిన టైమ్ లో అమెరికాలో సివిల్ వార్ జరిగింది ఆ టైంలో అబ్రహం లింకన్ గెలవడం జరిగింది. రెండోసారి ఎన్నికలు వెళ్లకముందు నల్ల జాతీయులకు ఓటు కల్పించడంతో...అమెరికాలో ఉన్న తెల్ల వాళ్ళు అబ్రహం లింకన్ ని చంపాలని ప్రయత్నం చేశారు. అయినా గాని అనేక ఆటుపోట్లను ఎదుర్కొని..నిరుపేద కుటుంబంలో జన్మించిన అబ్రహాం లింకన్ మనుషులు అంతా సమానమే అని తన పరిపాలన అమెరికా చరిత్రలో నిలిచిపోయేలా రాణించారు. ఈ క్రమంలో తాను ప్రెసిడెంట్ అవ్వటానికి అనేకసార్లు ఓడిపోవడం జరిగింది. దీంతో అబ్రహం లింకన్ కి మిస్టర్ ఫెయిల్యూర్ అనే పేరు రావడం జరిగింది. అయినా కానీ ఎక్కడ తన ఆత్మవిశ్వాసం కోల్పోకుండా ఎన్నికలలో పోటీ చేసి ప్రెసిడెంట్ గా గెలవడం జరిగింది. తాను చేరాలనుకున్నా గమ్యస్థానానికి చేరుకుని మిస్టర్ ఫెయిల్యూర్ నుండి అమెరికా ప్రెసిడెంట్ గా అబ్రహం లింకన్ సక్సెస్ ఫుల్ గా రాణించి 15 ఏప్రిల్ 1865లో తుది శ్వాస విడిచారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: