క‌రోనా వైర‌స్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉధృతంగా ఉంద‌ని చెప్పాలి. తెలంగాణ‌లో క‌న్నా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కాస్త త‌క్కువ‌గా ఉన్నా..ప‌రిస్థితి మాత్రం సీరియ‌స్‌గానే ఉంద‌ని అక్క‌డి అధికారులే అంగీక‌రిస్తున్నారు. వాస్త‌వానికి మ‌ర్క‌జ్ లింకుల‌తో రెండు తెలుగు రాష్ట్రాల్లో అనుహ్యంగా కేసులు న‌మోదవుతూ వ‌చ్చాయి. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో దాదాపు 600ల‌కు పైగా కేసులు న‌మోదు కాగా తెలంగాణలో ఇప్ప‌టి వ‌ర‌కు 813 కేసులు న‌మోద‌య్యాయి. ఈక్ర‌మంలోనే ఏప్రిల్ 20 నుంచి లాక్‌డౌన్ విష‌యంలో కొంత స‌డ‌లింపు ఇవ్వాల‌నే యోచ‌న‌లో రెండు రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌కు కేంద్రం నుంచి ఆదేశాలు అందాయి.

 

దీనికి సంబంధించిన మార్గ‌ద‌ర్శ‌కాలు కూడా ఆదివారం స్ప‌ష్టంగా అందాయి. ఇదిలా ఉండ‌గా తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ తెలంగాణ‌లో మే 7వ‌ర‌కు లాక్‌డౌన్ పొడిగించేందుకే మొగ్గు చూపుతున్న‌ట్లు స‌మాచారం. గ్రేట‌ర్ హైద‌రాబాద్ ప‌రిధిలో కరోనా వైరస్ కేసులు ఎక్కువ‌గా న‌మోద‌వుతుండ‌టంపై ముఖ్య‌మంత్రి కేబినేట్ మీటింగ్లో ఆందోళ‌న వ్య‌క్తం చేశార‌ని స‌మాచారం. దాదాపు మే7 వ‌ర‌కు లాక్‌డౌన్ పొడ‌గింపు ఖ‌రారైన‌ట్లేన‌ని తెలుస్తోంది. ఇదిలా ఉండ‌గా ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి మాత్రం లాక్డౌన్ ఎత్తివేత‌కు ఆస‌క్తి క‌న‌బ‌ర్చారు. మూడు రోజుల క్రితం కూడా ప్ర‌ధానిమోదీకి ఫోన్ చేసి మ‌రీ లాక్‌డౌన్‌లో త‌మ రాష్ట్రానికి మిన‌హాయింపు ఇవ్వాల‌ని కోర‌డం స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశంమైంది. 

 

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో పారిశ్రామిక రంగం, ఇత‌ర రంగాలు బాగా దెబ్బ‌తింటున్నాయ‌నే కార‌ణంతోనే ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి లాక్‌డౌన్ స‌డ‌లింపు నిర్ణ‌యానికే ఓటు వేసిన‌ట్లుగా తెలుస్తోంది. ఈమేర‌కు కేంద్ర ప్ర‌భుత్వం మార్గ‌ద‌ర్శ‌కాలను అనుస‌రించి ఏపీ ప్ర‌భుత్వం ఏప్రిల్ 20 నుంచి  కొన్ని రంగాల‌కు లాక్‌డౌన్ నుంచి సడలింపులను ఇచ్చింది. ఈ నిబంధ‌న‌లు ఏప్రిల్ 20వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని వెల్లడించింది. గ్రీన్‌ మండలాలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో కార్యకలాపాలకు ఏపీ ప్రభుత్వం పచ్చజెండా ఊపేయ‌డం గ‌మ‌నార్హం.  పరిశ్రమలు, సంస్థల నిర్వహణకు కూడా అనుమ‌తులిచ్చింది. అయితే తగిన రక్షణ చర్యలు తీసుకోవాలని సూచించింది.  ఇదిలా ఉండ‌గా తెలంగాణ సీఎం కేసీఆర్ అభిప్రాయం ఇందుకు విరుద్ధంగా ఉండ‌టం గ‌మ‌నార్హం. రాష్ట్రంలోని ఒక జిల్లాలో లాక్ డౌన్ సడలింపు చేపట్టి..మరో జిల్లాలో కొనసాగించడం స‌రైన ప‌ద్ధ‌తి కాద‌ని, అమ‌లుకు విఘాతం క‌లుగుతుంద‌ని అభిప్రాయ‌ప‌డుతున్నార‌ట‌. 


క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: