``ఏపీ ప్ర‌తిప‌క్ష నేత‌ చంద్రబాబు నిజంగా లాక్ డౌన్ లో ఉన్నాడా...లాకప్ లో ఉన్నాడా అనే సందేహం నాకు వ‌చ్చింది. దీనికి నా స‌మాధానం ఏంటంటే... అతను ఈరోజు లాక్ డౌన్ లో కాదు... నిజంగా లాకప్ లో ఉన్నాడనే విషయం తెలిసింది. చంద్రబాబు కొడుకు లోకేష్ నిక్కరు వేసుకుని సైకిల్ తొక్కుతున్న అపురూప దృశ్యాలు అంతా కూడా చూసే ఉంటారు. చిన్నబాబు ఆశ తను సైకిల్ తొక్కాలని, పెద్దబాబు సైకిల్ దిగడు. దిగాలనే ఉద్దేశ్యం ఆయనకు లేదు. చంద్రబాబు సైకిల్ పై కూర్చుంటే సైకిల్ కదలదు. చిన్నబాబు సైకిల్ పై కూర్చుంటే సైకిల్ బతకదు. ఇది ప్రధానమైన సమస్య. చంద్రముఖిగా మారిన చంద్రబాబును వేధిస్తున్న ప్రశ్న.`` అని  వైయస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ  పార్టీ నేత, పార్టీ జాతీయ ప్రధానకార్యదర్శి వి.విజయసాయిరెడ్డి విరుచుకుప‌డ్డారు.

 

లాక్ డౌన్ లో ఉన్న చంద్రబాబును చూసి నవ్వాల్నో, ఏడవాలో అర్థం కావడం లేదని విజ‌య‌సాయిరెడ్డి వ్యాఖ్యానించారు. ``అధికారం పొగొట్టుకున్నాడు...చిన్నబాబును ఓడగొట్టుకున్నాడు...పార్టీ ప్రెసిడెంట్ పదవిలో కరోనా గబ్బిలంలాగా అంటిపెట్టుకుని ఉన్నాడు. ఇప్పుడు మండలి కాస్తా రద్దు కాబోతోంది. ఇప్పుడు కొడుకు పరిస్ధితి ఏంటి. అది పెద్ద సంధిగ్దమైన ప్రశ్న. కుటుంబపరిస్ధితి ఎలా ఉందంటే ....నా కుమారుడు పరిస్ధితి ఏంది అని ఒకరడిగితే....నా భర్త పరిస్ధితి ఏందని ఇంకొకరడిగితే...ఈ ప్రస్టేషన్ అంతా తట్టుకోలేక, ఏం చేయాలో తెలియక చంద్రబాబునాయుడు ప్రస్టేషన్‌కు లోనవుతున్నాడు.
ఇలా పిచ్చి ప్రకోపించి వింత వింతగా ప్రవర్తిస్తున్నాడు. కాబట్టి ఆయన లాక్ డౌన్ లో లేడు...ఈరోజు లాకప్ లోనే ఉన్నాడనే విషయన్ని నేను పూర్తిగా ఆకళింపు చేసుకున్నాను.`` అని ఎద్దేవా చేశారు. 

 

``మీరందరూ రామ్ గోపాలవర్మ సినిమా చూసి ఉంటారు.అందులో ముుఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తున్నట్లుగా మన పప్పునాయుడు సీన్ చూసే ఉంటారు.అందులో మన పప్పునాయుడు మంగళగిరి అనే పదాన్ని ప్రాక్టీస్ చేయడం మరిచిపోయారు. పప్పునాయుడు పరిస్దితి కుడితిలోపడ్డ ఎలకలాగా తయారైంది. మంగళగిరి బదులుగా మందలగిరి అనుకుంటూ ఉన్నాడు. ప్రమాణ స్వీకారం కాగితం ఎలా, ఎక్కడ చదవాలో అర్ధం కావడం లేదు.చదివేందుకు గవర్నర్ అవకాశం ఇవ్వడం లేదు. పప్పు పరిస్దితి ఇప్పుడుగాని చూస్తే ఎమ్మెల్యే కాలేడు,రాజ్యసభ సభ్యుడు కాలేడు. ఎమ్మెల్సీ పదవి పోతుంది. ఇలా పరిస్దితి ఏంది అంటే అగమ్యగోచరంగా తయారైంది. పోనీ పార్టీ అధ్యక్షుడైనా అవుదామనుకుంటే చంద్రబాబు సైకిల్ దిగడు. పార్టీ అధ్యక్ష పదవి కొడుకుకు ఇవ్వడు. గబ్బిలం లాగా అలాగే పట్టుకుని ఉన్నాడు.ఇది పప్పు ప్రస్టేషన్.` అని వ్యాఖ్యానించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: