చైనాలోని పుహాన్ లో పుట్టుకొచ్చిన కరోనా మహమ్మారి ఇప్పుడు ప్రపంచాన్ని మొత్తం గడ గడలాడిస్తుంది.  కరోనా వైరస్ భూతం యూరప్ దేశాల్లో మరణ మృదంగం మోగిస్తోంది. గత కొన్నివారాలుగా ఇటలీ, బ్రిటన్, ఫ్రాన్స్, స్పెయిన్ తదితర దేశాలు మరణగీతం ఆలపిస్తున్నాయి. నిత్యం వేల సంఖ్యలో మరణాలతో ఈ యూరప్ దేశాల పరిస్థితి దయనీయంగా మారింది.  శనివారం నాటికి యూరప్ వ్యాప్తంగా 1,00,501 మంది మృత్యువాతపడ్డారు. మరోపక్క కరోనా బారిన పడిన వారి సంఖ్య 11,36,672గా ఉంది.

 

యూరప్‌లో ఇటలీ, స్పెయిన్‌ దేశాలపై కరోనా ప్రభావం ఎక్కువగా కనపడుతోంది.  23,227 మరణాలతో యూరప్ లో ప్రథమస్థానంలో ఉంది. స్పెయిన్ లో 20,453, ఫ్రాన్స్ లో 19,323, బ్రిటన్ లో 15,464 మంది కరోనాతో మృత్యువాత పడ్డారు. ఇక ప్రపంచం  మొత్తంలో కరోనా కేసుల విషయానికొస్తే ఇప్పటి వరకు 23,34,130 పాజిటివ్ కేసులను గుర్తించారు. మరణాల సంఖ్య 1,60,685కి చేరింది. 

 

అన్ని దేశాల కంటే అత్యధికంగా అమెరికాలో 39,090 మంది చనిపోయారు.  యూరప్ మొత్తంగా జర్మనీ దేశం మాత్రమే మరణాలను నియంత్రించినట్టు కనపడుతోంది. స్పెయిన్‌లో మరణాల సంఖ్య 20 వేలు దాటడంతో లాక్‌డౌన్‌ను కూడా పొడిగిస్తున్నట్టు ఆ దేశ ప్రధాని పెడ్రో శాంచెజ్ తెలిపారు. 

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: