ఏపీలో రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఏపీలో 647 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 565 కేసులు యాక్టివ్ లో ఉన్నాయి. అయితే కరోనా వ్యాప్తి పెరగకుండా ఉండేందుకు సీఎం జగన్ కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఎప్పటికప్పుడు ఆరోగ్య సర్వే నిర్వహిస్తూ, కరోనా బాధితుల్ని గుర్తిస్తున్నారు. ఇక దేశంలో రాజస్థాన్ తర్వాత అత్యధిక కరోనా టెస్టులు చేస్తున్నది ఏపీ ప్రభుత్వమే. అయితే జగన్ ప్రభుత్వం ఎంత కష్టపడుతున్న, టీడీపీ నేతలు విమర్శలు చేయడం ఆపడం లేదు.

 

తాజాగా కూడా జగన్ ప్రభుత్వంపై అర్ధంపర్ధం లేని విమర్శలు చేశారు.  కేంద్రం లాక్ డౌన్ ప్రకటించడంవల్లే అంతంతమాత్రంగా ఉందని, రాష్ట్ర ప్రభుత్వాన్ని నమ్ముకుంటే ఎన్నో ప్రాణాలు పోతాయని టీడీపీ నేతలు మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుని ప్రధాని మోదీ ఏపీని పట్టించుకోకుండా ఉంటే ఆంధ్రప్రదేశ్ మరో అమెరికా అయ్యేదని, జగన్ నిర్లక్ష్యం వల్లే ఏపీలో 11 జిల్లాలు రోడ్ జోన్ పరిస్థితికి వచ్చాయని అంటున్నారు. ఇక ఇక్కడ టీడీపీ నేతలు చేసే విమర్శల్లో ఎలాంటి అర్ధం లేదు. ప్రధాని మోదీ కరోనా వ్యాప్తి పెరగకుండా అన్ని రాష్ట్రాలపైన దృష్టిపెట్టారు. అలాగే కరోనాని కట్టడి చేయాలంటే మరోసారి లాక్ డౌన్ పొడిగింపు మార్గమని చెప్పి, మే 3 వరకు లాక్ డౌన్ పెంచారు. జగన్ ప్రభుత్వం కూడా ఇదే ఫాలో అవుతుంది.

 

జగన్ ప్రభుత్వ కృషి వల్లే కరోనా వ్యాప్తి అదుపులో ఉంది. మాములుగా అయితే రాష్ట్రంలో విదేశాల నుంచి వచ్చిన వారి వల్ల ఎక్కువ స్థాయిలో కరోనా కేసులు నమోదు కాలేదు. ఢిల్లీ మర్కజ్ యాత్ర నుంచి వచ్చిన వారితో కేసులు పెరిగాయి. అయినా సరే జగన్ ప్రభుత్వం మరిన్ని జాగ్రత్తలు పాటిస్తూ, దేశంలో ఎక్కడా లేని విధంగా వలంటీర్ల వ్యవస్థ ద్వారా సర్వే చేయిస్తూ, కరోనా బాధితుల్ని త్వరగా గుర్తిస్తూ, రోజుకు ఎక్కువ స్థాయిలో టెస్టులు చేస్తూ కరోనాని గుర్తిస్తున్నారు. అలాగే కరోనా ఒకరి నుంచి మరొకరి సోకకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఏదేమైనా కరోనా వ్యాప్తి పెరగకుండా కష్టపడుతున్న జగన్ ప్రభుత్వంపై అర్ధం లేని విమర్శలు చేయడం సమంజసం కాదు.

మరింత సమాచారం తెలుసుకోండి: