గత కొన్ని రోజులుగా కరోనా నేపథ్యంలో జగన్ ప్రభుత్వం లక్ష్యంగా టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. కరోనా వ్యాప్తిని అరికట్టడంలో జగన్ ప్రభుత్వం ఫెయిల్ అయిందని, కరోనా కేసుల్ని దాచిపెడుతుందని బాబుతో సహా టీడీపీ నేతలు ఇష్టారాజ్యంగా విమర్శలు చేస్తూ వచ్చారు. అలాగే రాజధానిని వైజాగ్ కు తరలించాలనే ఉద్దేశంతో, అక్కడ కరోనా కేసులు దాచిపెడుతున్నారని, కరోనా బాధితుల్ని ప్రయివేట్ ఆసుపత్రులకు తీసుకెళుతున్నారని కూడా మాట్లాడారు.

 

ఇక టీడీపీ చేసే విమర్శలకు వైసీపీ మంత్రులు కూడా గట్టిగానే కౌంటర్లు ఇచ్చారు. అయితే తాజాగా మాత్రం మంత్రి అవంతి శ్రీనివాస్ అదిరిపోయే డైలాగ్ ఒకటి వేసి, చంద్రబాబుకు ఛాలెంజ్ విసిరారు. ప్రతిపక్షాలు పదే పదే ప్రభుత్వం కేసులు దాస్తోందని విమర్శలు గుప్పించడం సబబుకాదని, ఒక్క కేసు దాచామని నిరుపించినా తాను మంత్రి పదవికి రాజీనామా చేస్తానని, ఒకవేళ నిరూపించలేకపోతే  చంద్రబాబు రాజకీయాల నుంచి తప్పుకుంటారా..? అని సవాల్ విసిరారు.

 

ఇక కరోనా కేసులు ఏమైనా డబ్బులా బ్యాంకుల్లో దాచుకోవడానికి అని అంటూ అదిరిపోయే పంచ్ ఒకటి ఇచ్చారు. కేసులను ప్రతిపక్ష పార్టీలు గానీ.. వారి ఎమ్మెల్యేలుగానీ నిరూపించాలన్నారు. అయితే మంత్రి విసిరిన సవాల్ కు స్పందించే సత్తా చంద్రబాబుకు గానీ, టీడీపీ నేతలకు ఉండదని అర్ధమవుతుంది.

 

ఒకవేళ వారు స్పందించినా, ఛాలెంజ్ స్వీకరించే దమ్ము టీడీపీ వాళ్లకు ఉండదు. ఎందుకంటే కరోనాని దాయడం ఎవరి వల్ల కాదు. అది దాస్తే రాష్ట్రమే నాశనమైపోయే స్టేజ్ వస్తోంది. అసలు అలా కేసులు దాచేయాల్సిన అవసరం జగన్ ప్రభుత్వానికి ఏమి లేదు. ఇప్పటికే కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు జగన్ ప్రభుత్వం సమర్ధవంతంగా పనిచేస్తోంది. ఇక ఇదే విషయం మంత్రి అవంతి కూడా చెబుతున్నారు. అసలు కరోనా కేసులు ఏమన్నా డబ్బులా బ్యాంకులో దాచుకోవడానికి అని సెటైరికల్ గా చెప్పారు. కాబట్టి ఇప్పటికైనా టీడీపీ నేతలు కరోనా పై రాజకీయం చేయడం ఆపేస్తే బెటర్ ఏమో.

మరింత సమాచారం తెలుసుకోండి: