కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించడంతో ప్రజలంతా అనేక అవస్థలు పడుతున్నారు. అనుకోని విపత్తు గా వచ్చిన ఈ కరోనా వైరస్ వల్ల ప్రజలంతా ఇళ్లకే పరిమితం అవ్వడం జరిగింది. చాలామంది కుటుంబం లాకురావడం కోసం అనేక అవస్థలు పడుతున్నారు. అడుగు తీసి అడుగు బయట వేయటానికి అనేక ఇబ్బందులు ప్రభుత్వపరంగా ఉండటంతో ఎవరికీ ఎప్పుడూ చెప్పుకోలేని బాధలు ప్రజలు అనుభవిస్తున్నారు. ముఖ్యంగా సామాన్యుడు, పేదవాడు అయితే ఆకలి కేకలు పెడుతున్నారు.

 

ఇలాంటి సమయంలో విద్యాసంస్థలు మానవత్వం లేకుండా వ్యవహరిస్తున్నాయి. ఇంటికే పరిమితమైన పిల్లలకు ఆన్ లైన్ క్లాసులు అంటూ తల్లిదండ్రుల దగ్గర ఫీజుల దందా మొదలుపెట్టారు. తిండి లేక అనేక అవస్థలు పడుతున్న తల్లిదండ్రులను ఆన్ లైన్ క్లాసులు చెబుతూనే మరోపక్క ఫీజు కచ్చితంగా కట్టాలని పిల్లలకి ఫోన్ చేసి...తల్లిదండ్రులను అడగాలని కోరుతున్నారు. తాజాగా ఇలాంటి ఫోన్ సంభాషణ 1 సోషల్ మీడియాలో రిలీజ్ అయింది.

 

ఇటువంటి విషయాలలో ప్రభుత్వం స్పందించాలని...అసలు  ఆన్ లైన్ తరగతులు ఎవరు నిర్వహించమని కోరారు అంటూ తల్లిదండ్రులు యాజమాన్యాలను ప్రశ్నిస్తున్నారు. మా కుటుంబాలను పోషించుకోవడం చేత కాక అనేక ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్న ఇలాంటి తరుణంలో మానవత్వంతో ఆలోచించకుండా డబ్బులు ఎలా అడగాలి అని అనిపిస్తుంది అంటూ విమర్శలు చేస్తున్నారు. వెంటనే ప్రభుత్వాలు ఇలాంటి ఫీజుల దందా చేస్తున్న స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. 




క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

Apple : https://tinyurl.com/NIHWNapple.

మరింత సమాచారం తెలుసుకోండి: