కరోనా వైరస్ తో హైదరాబాద్ గజగజ లాడుతుంది. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ పాజిటివ్ కేసులు హైదరాబాద్ లో నమోదు అవటంతో లాక్ డౌన్ చాలా పటిష్టంగా అమలు చేస్తున్నారు తెలంగాణ పోలీసులు. అత్యవసర మరియు నిత్యవసర సరుకులు మినహా మరి ఏ విషయంలోనూ ప్రజలను ఇంటి నుండి బయటకు రాకుండా కట్టుదిట్టంగా వ్యవహరిస్తున్నారు. డ్రోన్ కెమెరా లతో ఎక్కడికక్కడ పగడ్బందీగా ఆకతాయిల పని పడుతున్నారు. రోడ్డుపై నిర్దిష్ట సమయంలో కాక అనవసరంగా వస్తే వాహనాన్ని సీజ్ చేస్తున్నారు.

 

భారీ స్థాయిలో ఫైన్ కడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో హైదరాబాద్ నగరం ఉంది. ఇటువంటి తరుణంలో తాజాగా హైదరాబాద్ వాసులు ఫుడ్ ఆర్డర్ ఇవ్వాలి అన్న వణుకుతున్నారు. ఎందుకంటే నాంపల్లి కి చెందిన ఫుడ్ డెలివరీ యాప్ సంస్థలో పనిచేసే డెలివరీ బాయ్ కి కరోనా పాజిటివ్ అని తేలిందట. దీంతో గడిచిన రెండు వారాలుగా ఆటలు ఎటువంటి హోటల్ కి వెళ్లారు ఎలాంటి రెస్టారెంట్లలో తిరిగాడు మరియు ఫుడ్ ఆర్డర్ లు తీసుకున్నాడు అన్న దాని విషయంలో క్లారిటీ ఇప్పటి వరకు ఎవరికీ రాలేదు.

 

దీంతో హైదరాబాద్ వాసులంతా ఫుడ్ ఆర్డర్ ఇవ్వాలి అంటే వణుకుతున్నారు. మరోపక్క ఆ డెలివరీ బాయ్ మరియు అతని కుటుంబ సభ్యులను క్వారంటైన్ సెంటర్ కు తరలించారు. ఇదే టైమ్ లో అతని ట్రావెల్ చేసిన హిస్టరీని కూడా బయటకు తీస్తున్నారు అధికారులు. ఈ టైములో అతడు ఏ రెస్టారెంట్లలో తిరిగాడు అన్న దాని విషయంలో వివరాలు తీయడానికి చాలా కష్టతరంగా మారింది అని అధికారులు అంటున్నారు. 




 క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

Apple : https://tinyurl.com/NIHWNapple.

మరింత సమాచారం తెలుసుకోండి: