ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా నియంత్రణలో భాగంగా లాక్ డౌన్ అమలులోకి తీసుకొచ్చారు.. అందులో భాగంగా ప్రజలు ఇళ్లకే పరిమితం అవ్వడంతో అన్నీ రంగాలు స్వచ్చందంగా మూతపడ్డాయి..కరోనా కారణంగా బాధపడుతున్న పేదలను ఆదుకోవడానికి స్వంచంధ సంస్థలు ముందుకొస్తున్నాయి.. దాంతో పాటుగా సినీ రాజకీయ ప్రముఖులు అభిమానుల కూడా ఎక్కడిక్కడ అన్నదాన కార్యక్రమాలు చేస్తూ పేదల జీవితాల్లో వెలుగులు కరోనా మహమ్మారిని తరిమి కొట్టాలని ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తున్నారు.. 

 

 

 

 

భారత దేశ ఐకమత్యాన్ని చాటుకుంటూ కుల మతాలకు అతీతంగా పేదలకు  సాయం చేయడంలో ముండుకొస్తూ మరో సారి భారత దేశం సకల మత సమ్మేళనం అని నిరూపించింది .. మే 3 వరకు లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజలు ఇళ్లలోనే ఉంటూ కరోనా సోకకుండా జాగ్రత్తలు పాటించాలని కోరుతున్నారు.. ప్రజల్లో కరోనా పై అవగాహన కల్పించడానికి సినీ రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా ను వేదికగా తెలియ పరుస్తున్నారు.. 

 

 

 

లాక్ డౌన్ కారణంగా అన్నం దొరకలేదని చిన్నారులు కప్పలను తింటున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.బీహార్ రాష్ట్రంలోని జేహనాబాద్ లో ఈ ఘటన జరిగింది.. కరోనా నియంత్రణలో భాగంగా ప్రజలు ఇళ్ళ నుంచి బయటకు రాకపోవడంతో అన్నం పెట్టేవాళ్ళు లేక కప్పలను తింటున్నారట.. అందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.. ఆ వీడియో చిన్నారులు మాట్లాడుతూ ... గత ఐదు రోజుల నుంచి తినడానికి తిండి దొరకలేదని అన్నారు.. దాంతో ఇంటికి సమీపంలో ఉన్న మురికి కాలువ లోని కప్పలను పట్టుకొని తింటున్నట్లు తెలిపారు.. అయితే పాఠశాలల్లో ఉంటే అందులో పెట్టే వారని, ఇప్పుడు సర్కార్ మూసివేయడం తో కప్పలను తిని బ్రతుకుతున్నా మని చెప్పుకొచ్చారు.. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవ్వడంతో పాటుగా వారి ఆకలిని తీర్చడానికి దాతలు ముందుకు రావాలని నెటిజన్లు కోరుతున్నారు..

 

మరింత సమాచారం తెలుసుకోండి: