కరోనా వైరస్ వల్ల అనేకమంది ఆకలి కేకలతో అనేక అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వం విధించిన నిబంధనలకు ఇంటి నుండి కాలు తీసి బయట పెట్ట లేక పోవడంతో ఏ రోజుకి ఆ రోజు బతికే పేద వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా మారింది. మరోపక్క మందు బాబులు కూడా అనేక అవస్థలు పడుతున్నారు. మద్యానికి బానిస అయిపోయిన మందుబాబులు లాక్ డౌన్ లో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చాలామంది పిచ్చివాళ్ళ అవుతూ పిచ్చాసుపత్రికి వెళ్తున్నారు. తెలంగాణ మరియు పశ్చిమ బెంగాల్ లో చాలామంది పిచ్చివాళ్ళ అయిపోయే పరిస్థితి ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. లాక్ డౌన్ లో  ప్రభుత్వాలు చాలా కఠినంగా వ్యవహరించడంతో ఎక్కడా కూడా మద్యం షాపులు ఓపెన్ చేసే పరిస్థితి లేదు.

 

ఇటువంటి టైములో కొంతమంది ఇంటిలోనే మద్యం తయారు చేసుకుంటున్నారట. ఇలాంటి ఘటన ఒకటి హైదరాబాదులో చోటు చేసుకుంది. తల్లి మరియు కొడుకు ఇద్దరూ కలిసి ద్రాక్ష రసంతో మద్యం తయారు చేసి దానిని ఏవిధంగా తయారు చేయాలి అన్న దాన్ని వీడియో చేసి అమ్ముతూ సోషల్ మీడియాలో రిలీజ్ చేయడం జరిగింది. దీంతో వెంటనే పోలీసులు గుర్తించి తల్లి కొడుకును అరెస్టు చేశారు. వాళ్ల దగ్గర ఉన్న మద్యం సరుకు స్వాధీనం చేసుకున్నారు.

 

ప్రభుత్వం ఎన్ని కఠిన నియమ నిబంధనలు పెట్టినా మద్యం విషయంలో మందుబాబులు ఆగడాలు మాత్రం అస్సలు ఆగడం లేదు. కొన్నిచోట్ల మందుబాబులు అర్ధరాత్రి పూట మద్యం నిల్వ ఉంచే షాపులను చోరీ చేస్తూ దొంగతనాలకు పాల్పడుతున్న ఘటనలు ఇటీవల చోటుచేసుకుంటున్నాయి. లాక్ డౌన్ కారణంగా మందుబాబులు అనేక అవస్థలు పడుతున్నారు.

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple.

మరింత సమాచారం తెలుసుకోండి: