కాస్త బుర్రా, బుద్ధి ఉన్నాయనే కానీ..లేకపోతే.. మనిషి కూడా ఓ జంతువేగా.. కాకపోతే.. కాస్త లేటెస్ట్ వెర్షన్ అంతే కదా. మరి ఏ జీవికీ లేనన్ని ప్రత్యేకతలు మనిషికి ఉన్నప్పుడు.. ఆ మనిషి ప్రస్థానం కూడా అంతే ఉన్నతంగా ఉండాలి కదా.

 

 

మరి వాస్తవంలో అలా ఉంటుందా..? లేదా.. ఈ ప్రకృతిలో ఏ మనిషికీ లేనన్ని బలహీనతలు కూడా మనిషికే ఎందుకు ఉంటున్నాయి. ఉదాహరణకు ఉదయం పేపర్ తిరగేయగానే ఎన్నో ఆత్మహత్యల వార్తలు కనిపిస్తున్నాయి. మరి ఈ అలవాటు అంతగా బుద్ధి అభివృద్ధి చెందని జీవుల్లో కూడా లేదు కదా.

 

 

రాతి నేలమీద పడ్డా, తడి తగిలేదాకా లోతుగా వేళ్లను విస్తరిస్తూ కష్టమ్మీద మొక్కయి.. మానై చివరకు కొండ చెట్టయి సగర్వంగా చిగుళ్లు మెలేస్తుంది విత్తనం. పులి లాంటి క్రూరజంతువు వేగంగా వెంటాడుతుంటే బతుకు మీద ఆశను వదులుకోకుండా కూరజంతువులా మిగిలిపోకుండా గుండెలు అవిసిపోయేలా ఎగిరిదూకుతూ శాయశక్తులా తప్పించుకోవాలని ప్రయత్నిస్తుంది జింక పిల్ల. సృష్టిలో ఏ జీవీ ఓటమిని అంత తేలిగ్గా అంగీకరించదు.

 

 

మరి మనిషికే ఎందుకు ఈ దురవస్థ. ఎందుకంటే అది కూడా ఓ మానసిక దురవస్థే. మనిషిలో ఆశావాదం కొరవడినప్పుడు.. ఇలాంటి ఆత్మహత్యలు జరుగుతుంటాయి. మానసిక స్థైర్యం లోపించినప్పుడు తనను తాను అంతం చేసుకోవాలనిపిస్తుంది. సానుకూల ధోరణి, ఆశావహ దృక్పథం మనిషిని విజయ తీరాలకు తప్పక చేరుస్తాయి.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: