కరోనా.. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. మరి ఈ కరోనా గురించి మీ నాలెడ్జ్ ఎంత.. ఓసారి చెక్ చేసుకోండి. ఇక్కడ మీకోసం 20 ప్రశ్నలు, సమాధానాలు ఇస్తున్నాం.. ఈ క్రింది 20 ప్రశ్నలకు మీరు 15 ప్రశ్నలకు పైగా సరైన సమాధానాలు చెప్పారంటే.. కరోనా గురించి మీ అవగాహన అమోఘం. మరి చెక్ చేసుకోండి మీరు ఎన్ని ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పగలరో..?

 

 

1.కరోనా వైరస్ ఏ దేశంలో పుట్టింది ?

 

జవాబు : చైనా

 

2. చైనా దేశంలోని ఏ నగరంలో మహమ్మారి కరోనా వైరస్ పురుడు పోసుకుంది.?

 

జవాబు: వుహన్,హుబే,నగరంలో

 

3. కరోనా వైరస్ శాస్త్రీయ నామం.?

 

జవాబు : కోవిద్-19.(SARS-COV-సివియర్ ఎక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్,MERS-COV,మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్).

 

4. భారతదేశంలో కరోనా వైరస్ వల్ల జనతా-కర్ఫ్యూ ఏ రోజున నిర్వహించారు.?

 

జవాబు: 22-మార్చ్,2020.

 

5. కరోన వ్యాధి నిర్మూలనలో సేవలందిస్తున్న వైద్య,ఆరొగ్య,రక్షణ, మున్సిపాలిటీ సిబ్బందికి జనతా కర్ఫ్యూ రోజు ఎన్ని గంటలకు భారత దేశంలో ఉన్న ప్రతి పౌరుడు బయటకు వచ్చి కరతాళ ధ్వనులతో వారి సేవలకు సంఘీభావం తెలిపారు.?

 

జవాబు: మార్చ్ 22, 2020,సాయంత్రం 5 గంటలకు

 

6.భారతదేశంలో కరోనా వ్యాధి నిర్మూలనలో సేవలందిస్తున్న సిబ్బందికి మద్దతుగా స్ఫూర్తి జ్యోతి వెలిగించిన తేదీ.?

 

జవాబు: ఏప్రిల్ 5

 

7.భారతదేశంలో స్ఫూర్తి జ్యోతి వెలిగించిన సమయం

 

జవాబు: ఏప్రిల్ 5న రాత్రి 9॥గంటల.09 నిమిషాలకు.

 

8.భారత్ లో తొలి కరోన కేసు ఏ రాష్ట్రంలో నమోదు అయ్యింది.?

 

జవాబు: కేరళ

 

9.కరోనా సమయంలో భారత వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఎవరు ?

 

జవాబు : హర్షవర్ధన్ గారు.

 

10.కరోనా సమయంలో తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఎవరు ?

 

జవాబు : ఈటేల రాజేందర్ గారు.

 

11.శ్వాస వ్యవస్థపై ప్రభావం చూపే ఈ కరోనా వైరస్‌ను తొలిసారిగా ఏ సంవత్సరంలో గుర్తించారు.?

 

జవాబు : 1960 లో

 

12.ఈ వైరస్ లక్షణాలను మొదట గుర్తించిన వైద్యుడు?

 

జవాబు: లీ వెన్లియాంగ్.

 

13.ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ తొలి కేసు నమోదైన తేదీ.?

 

జవాబు : 1 డిసెంబర్ 2019.

 

14. కరోనా ఏ భాషా పదం దాని అర్థం ఏంటి ?

 

జవాబు : లాటిన్ భాషా పదం,కిరీటం అని అర్థం.

 

 

15.వుహాన్ నుంచి వ్యాపించి అంటువ్యాధులకు కారణమైన ఈ వైరస్‌కు ఏమని పేరు పెట్టారు ?

 

జవాబు : 'నావెల్ కరోనా వైరస్ లేదా nCoV'అని పేరు పెట్టారు.

 

16.కరోన,కోవిద్-19 లక్షణాలు బయటపడడానికి ఎన్ని రోజుల సమయం పడుతుంది. ?

 

జవాబు : 1 నుండి 14 రోజులు.

(సాధారణంగా 5 రోజుల్లో బయటపడుతుందని WHO తెలిపింది).

 

17.ఈ వ్యాధి వ్యాపించిన వారిలో ఎంత శాతం మంది చనిపోయే అవకాశం ఉంది.?

 

జవాబు : 2-3 %

 

18.కరోనా వైరస్ మనిషిలోని ఏ వ్యవస్థపై దాడి చేస్తుంది ?

 

జవాబు : శ్వాస వ్యవస్థ

 

19.కరోనా వైరస్ వ్యాపించిన వ్యక్తిలో కనిపించే లక్షణాలు ఏవి ?

 

జవాబు : జలుబు,దగ్గు,జ్వరం,శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది.

 

20.కరోనా వ్యాధి సమాచారం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన యాప్(App) పేరు ?

 

జవాబు : ఆరోగ్య-సేతు

 

మరింత సమాచారం తెలుసుకోండి: