కరోనా వైరస్ ప్రపంచ దేశాలను ఎలా వణికిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. రోజు రోజుకు పెరుగుతున్న ఈ కరోనా వైరస్ ను అరికట్టేందుకు ప్రపంచ దేశాలు లాక్ డౌన్ ప్రకటించాయి. దీంతో అన్ని దేశాలు ప్రస్తుతం లాక్ డౌన్ లో కొనసాగుతున్నాయి. దీంతో ప్రపంచ దేశ ప్రజలు ఇంటికే పరిమితం అయ్యారు. 

 

దీంతో అన్ని దేశాల ప్రజలకు వారి వారి అధికారులు నిత్యావసర వస్తువులు పంపిణి చేస్తున్నారు.. ఇంకా ఇక్కడ ఒక చోట పంపిణి చేసిన సరుకులు సోషల్ మీడియాలో షాక్ కి గురి చేస్తున్నాయి. అసలు ఎం జరిగింది అంటే? లాక్ డౌన్ కారణంగా మద్యం దుకాణాలు అన్ని బంద్ అయినా సంగతి తెలిసిందే. 

దీంతో మద్యం చుక్క లేక మందుబాబులు అల్లాడిపోతున్నారు. అలాంటి ఈ సమయంలో ఓ దేశంలో మద్యం ఫ్రీ గా ఇంటికే లభిస్తుంది. ఫ్రీగా నా అని ఆశ్చర్యపోతున్నారా? ఇంకా ఉంది ఆగండి.. ఆ మద్యం కూడా ప్రభుత్వమే ఫ్రీ గా ఇస్తుంది. ఎందుకో తెలుసా? ఆల్కహాల్ వల్ల కరోనా వైరస్ చచ్చిపోతుందంటూ ఇంటింటికీ మద్యం సరఫరా చేస్తున్నారు. దీంతో ఆల్కహాల్ అలవాటు లేనివాళ్లు కూడా కోవిడ్-19 భయంతో మద్యం తాగేస్తున్నారు.

 

అయితే మధ్య తాగకూడదు అని కందించాల్సిన ప్రభుత్వమే ఇలాంటి పనులు చేస్తుంది అని భావించిన ప్రపంచ ఆరోగ్య సంస్ద ఆశ్చర్యపోయి అడగగా వారు ఆ సమాధానం ఇచ్చారు.. ఇంకా ఆ కెన్యా రాజధాని నైరోబి గవర్నర్ మైక్ సోంకోకు ఆల్కహాల్ కలిగిన శానిటైజర్లు కరోనా వైరస్‌ను చంపేస్తాయనే సూచన మరోలా అర్థం చేసుకున్నారు. 

 

దీంతో ఆయనకు మరో ఆలోచన చేసి చేతులు మాత్రమే ఎందుకు? గొంతును కూడా ఆల్కహాల్‌తో శుభ్రం చేస్తే కరోనా వైరస్ లోపలికి చేరకుండా చనిపోతుందని భావించారు. ఇంకా అంతే.. వెంటనే తమ ప్రజలకు ఆల్కహాల్ పంచాలి అని ఆదేశాలు జారీ చేసారు. దీంతో అధికారులు ప్రజలకు పంపిణీ చేసే ఫుడ్ ప్యాకెట్లతో ఆల్కహాల్ పంపి ఆశ్చర్యపరుస్తున్నరు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: