కరోనా కష్టకాలంలో మనిషి నేర్చుకోవలసిన ఎన్నో విషయాలు కళ్లముందు ప్రత్యక్షంగా కనబడుతున్నాయి.. ఈ పుడమి మీద బ్రతికినన్ని నాళ్లూ.. నేను.. నాది అనే అహంకారంతో సాటిమనిషిని హీనంగా చూస్తున్న ప్రతి వ్యక్తికి కరోనా ఒక మంచి గుణపాఠం.. మానవత్వం మరచి ప్రవర్తిస్తున్న వారికి కరోనా జ్ఞానోదయం కలిగించే మార్గం.. ఎన్ని ఉన్న.. ఎంత ఉన్న మనిషికి  ఇచ్చే విలువ మరణించాక తెలుస్తుంది.. కానీ ఏం లాభం మరణించిన వారికి ఆ విషయం తెలియదు.. కనీసం బ్రతికి ఉన్నావాడైనా ఈ నిజాన్ని గ్రహించడు..

 

 

ముఖ్యంగా కరోనా వైరస్ వ్యాపించిన ఈ కాలంలో ఒక మనిషి మరణిస్తే ఎంతదారుణంగా ఉంటుందో ఇప్పటికే అక్కడక్కడ జరుగుతున్న ఘటనలు తెలుసుకుంటే.. ఈ బ్రతుకు చచ్చిన కుక్కకంటే దారుణం అని అనిపిస్తుంది.. ఎందుకంటే చావుకు మంచి, చెడులు లేవు.. కోటీశ్వరుడు, కూటికి లేని వాడనే తేడా తెలియదు.. చంపడం ఒక్కటే దాని విధానం.. ఇక చచ్చినవాన్ని ఎవరు ఇంట్లోపెట్టుకుని పూజించరు కదా.. మరి ఇంతకాలం నా కొడుకు, నా భార్య అంటూ లేనిపోని భ్రమలో బ్రతుకుతున్నావు.. అహంకారంతో విర్రవీగుతున్నావు.. నీ ఆస్తులను పంచుకున్నట్లు నీ చావును పంచుకోలేని మనుషుల కోసమా అడ్దమైన మోసాలు చేసి.. ఎన్నో అబద్ధాలు ఆడి సంపాదించావు.. ఇదిగో ఇక్కడ జరిగిన సంఘటనను చూసైన మనిషి జీవితం ఏంటో తెలుసుకో.. ఇక  కన్నీరు పెట్టించే హృదయ విదారకమైన ఈ ఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది..

 

 

అదేంటో చూస్తే.. మార్కెట్‌లో చనిపోయిన ఓ వ్యక్తిని మార్చురీకి తరలించేందుకు ఏ వాహనమూ అందుబాటులో లేకపోవడంతో ఆ శవానికి మొత్తం వస్త్రం చుట్టేసి వెనక సీటుపై ఉంచి తీసుకెళ్లడం సంచలనం రేపుతోంది.. కామారెడ్డిలోని గాంధీ గంజ్ ప్రాంతంలో నివాసం ఉండే ఓ వ్యక్తి నగరంలోని మార్కెట్‌లో కూలీ పని చేస్తున్నాడు. అయితే ఇతనికి ఉన్న అనారోగ్యం వల్ల ఆదివారం ఉన్నట్టుండి మరణించాడు.. ఈ విషయాన్ని స్దానికులు పోలీసులకు తెలుపగా, ఇది అనుమానాస్పద మృతి కాబట్టి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించాలని వారు సూచించి ఈ బాధ్యతను ఓ పారిశుద్ధ్య కార్మికుడికి అప్పగించారు..

 

 

అయితే ఆ పారిశుద్ధ్య కార్మికుడు చనిపోయిన ఆ వ్యక్తి మృతదేహాన్ని తరలించే క్రమంలో అంబులెన్స్‌కు ఫోన్ చేయగా అవి అందుబాటులో లేకపోవడంతో, చుట్టుపక్కల వారిని సాయం కోరాడు. ఎవరు ముందుకు రాకపోవడంతో ఏంచేసేది లేక తన సైకిల్‌పై శవాన్ని తీసుకెళ్లాలని నిర్ణయించుకుని, మృత దేహానికి బట్ట కట్టి, తన సైకిల్‌ వెనక సీటుపై ఉంచి.. ఆ శవం సైకిల్‌పై నుంచి పడిపోకుండా అటు ఇటూ బ్యాలెన్స్ చేసుకుంటూ ఆస్పత్రి మార్చురీకి తీసుకెళ్లాడు.. నిజంగా బ్రతికి ఉన్నప్పుడు ఎలాగో మనిషి మంచివాడుగా బ్రతకడు.. చివరికి మరణించాక అతని మంచితనాన్ని బ్రతికినంత కాలం తాను చేసుకున్న పాపపుణ్యాలే నిర్ణయిస్తాయి.. చాల మంది ఈ విషయాన్ని మరచి తాము గొప్పవారనే భావనలో బ్రతుకుతున్నారు..  

మరింత సమాచారం తెలుసుకోండి: