క‌రోనా వైర‌స్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ఎంతో శ్ర‌ద్ధ చూపుతోంది. క‌రోనా అనుమానిత ల‌క్ష‌ణాలున్న వారంద‌రికీ ప‌రీక్ష‌లు నిర్వ‌హించేందుకు సిద్ధ‌మ‌వుతోంది. అందుకోస‌మే ద‌క్షిణ‌కోరియా నుంచి దాదాపు 2ల‌క్ష‌ల ర్యాపిడ్ టెస్టు కిట్ల‌ను తెప్పించిన విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే వైద్య ప‌రీక్ష‌లు జోరుగా సాగుతున్నాయి. ఇదిలా ఉండ‌గా ఆంధ్ర‌ప్రదేశ్ రాష్ట్రం క‌రోనా టెస్టుల నిర్వ‌హ‌ణ‌లో ఓ రికార్డును క్రియేట్ చేసింది. అత్యంత త‌క్కువ స‌మ‌యంలో ఎక్కువ‌గా వైద్య నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు నిర్వ‌హించిన రాష్ట్రంగా గుర్తింపు పొంద‌డం విశేషం. 

 

కరోనా నిర్ధారణ పరీక్షలు చేయడంలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్‌ రెండోస్థానానికి ఎగబాకింది. ఇప్పటి వరకూ ఏపీ కంటే ముందు వరుసలో ఉన్న కేరళను వెనక్కినెట్టి 2వ స్థానానికి చేరుకుంది. జాతీయ సగటులో మిలియన్‌ జనాభాకు 268 మందికి పరీక్షలు చేస్తుండగా.. ఏపీలో మాత్రం 539 మందికి పరీక్షలు జ‌రుగుతుండ‌టం గ‌మ‌నార్హం. వాస్త‌వానికి మిగ‌తా రాష్ట్రాల‌తో పోల్చితే ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో పెద్ద‌గా క‌రోనా కేసుల సంఖ్య‌తక్క‌వ‌నే చెప్పాలి. అది కూడా త‌గ్గుముఖం ప‌డుతోంద‌న్న నివేదిక‌లే వ‌స్త‌న్నాయి. గ‌త వారం రోజులుగా కేసులు సంఖ్య క్ర‌మంగా త‌గ్గుతూ వ‌స్తుండ‌టాన్ని నిపుణులు గుర్తు చేస్తున్నారు. అయితే ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌ల్లో భాగంగా ప్ర‌భుత్వం క‌రోనా ప‌రీక్ష‌ల‌ను ముమ్మ‌రం చేసింది. 

 

క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌ల్లో ఒక్క రాజస్థాన్‌ మినహా మిగతా రాష్ట్రాలన్నీ ఆంధ్రప్రదేశ్‌ కంటే వెనుకంజలోనే ఉండ‌టం గ‌మ‌నార్హం. రెండు రోజుల కిందట వరకూ తమిళనాడు, కేరళ రాష్ట్రాలు టెస్టుల్లో కాస్త ముందు ఉండ‌గా.. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ర్యాపిడ్ టెస్టు కిట్లు చేరిన ద‌ర‌మిలా టెస్టుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఇక  పెద్ద రాష్ట్రాలైన‌ పశ్చిమబెంగాల్‌లో వైద్య ప‌రీక్ష‌లు చాలా త‌క్కువ‌గా జ‌రుగుతున్నాయ‌ని, ఇది మంచి ప‌రిణామం కాద‌ని  ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) ఆదివారం విడుదల చేసిన ప్ర‌క‌ట‌న‌లో ఆందోళ‌న వ్య‌క్తం చేసింది. 

 

 


క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: