ప్ర‌స్తుతం తెలంగాణ రాజ‌కీయాల్లో తెలంగాణ సీఎం కేసీఆర్‌కు పోటీ వ‌చ్చే నేత అంటూ ఎవ్వ‌రూ కూడా క‌నుచూపు మేర కూడా క‌న‌ప‌డ‌డం లేదు. కొన్ని ద‌శాబ్దాల తెలంగాణ క‌ల‌ను నెర‌వేర్చిన కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డ్డాక జ‌రిగిన రెండు ఎన్నిక‌ల్లోనూ తిరుగులేని విజ‌యం సాధించారు. తెలంగాణ ఏర్ప‌డ్డాక ఎలాంటి అనూహ్య మార్పులు లేక‌పోతే తొలి ప‌దేళ్లు ఆయ‌నే సీఎంగా ఉండ‌నున్నారు. ఇక 2014 ఎన్నిక‌ల‌ను మించిన మెజార్టీతో రెండోసారి అధికారంలోకి వ‌చ్చాక కేసీఆర్ తిరుగులేని సంచ‌ల‌న నిర్ణ‌యాల‌తో దూసుకుపోతున్నారు.

 

ఇక ప్ర‌స్తుతం ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా వైర‌స్ నేప‌థ్యంలో అన్ని దేశాలు.. కోట్లాది మంది ప్ర‌జలు అల్ల‌లాడిపోతున్నారు. ఇంత సంక్లిష్ట ప‌రిస్థితుల్లో కూడా కేసీఆర్ తిరుగులేని రాజ‌కీయ చ‌తుర‌త‌తో పాల‌న చేస్తూ దేశవ్యాప్తంగా అంద‌రి చేతా శ‌భాష్ అనిపించుకుంటున్నారు. మ‌రోవైపు సోష‌ల్ మీడియాలోనూ కేసీఆర్ గురించి సామాన్య జ‌నాలు ఆకాశానికి ఎత్తేస్తూ కీర్త‌న‌లు చేస్తున్నారు.

 

ప‌లు హిట్ సినిమాల టైటిల్స్‌తో ఆయ‌న్ను పొగిడేస్తున్నారు. తాజాగా కేసీఆర్ గురించి వైర‌ల్ అవుతోన్న ఓ ట్వీట్ అంద‌రిని ఆక‌ట్టుకుంటోంది.
ఆడు మొగాడ్రా బుజ్జి!
రాష్ట్రానికి ఆదాయం రాదు.. ఖజానా లోపలికి పోతదని తెలిసినా.. ఈ బ్లంట్ అండ్ బోల్డ్ డిసిషన్స్ ఏంట్రా బుజ్జి. ఇంత దరిద్రంలో కూడా ప్రతీ రైతు పండించే పంటను ప్రభుత్వం కొనేలా చూసుకోవడం ఏంట్రా? తెలంగాణ దేశానికి అన్నం పెట్టడం ఏంట్రా బుజ్జా? అసలా మాటలేంట్రా..

 

మరింత సమాచారం తెలుసుకోండి: