కుక్క‌తోక‌ను ప‌ట్టి ఏడాదంతా ఉతికిన వంక‌రే అన్న‌ట్లుగా ఉంది పాకిస్థాన్ వైఖ‌రి. భార‌త్‌ను దూషించి స్థానిక ముస్లిం ప్ర‌జానీకం నుంచి అభిమానం సంపాదించుకోవాలని తెగ ఆరాట‌ప‌డిపోతూనే ఉంటుంది. గ‌త అధ్య‌క్షుల మాదిరిగానే...ఇప్పుడున్న అధ్య‌క్షు డు ఇమ్రాన్ కూడా అదే బాట‌లోనే ప‌య‌నిస్తున్నాడు. త‌మ ద‌రిద్రాన్ని వ‌దిలించుకోనోడు...ఎదుటి వాళ్ల ఇంట్లో దరిద్రాన్ని ఎంచిన‌ట్లుగా ఉంది ఆయ‌న మాట‌ల తీరు. భార‌త్‌లో ముస్లింల‌కు స‌రైన వైద్యం అంద‌డం లేదని, క‌రోనా వైర‌స్ వ్యాప్తికి ముస్లింలే కార‌ణ‌మ‌న్న‌ట్లుగా భార‌త ప్ర‌భుత్వం వేలెత్తి చూపుతోంద‌ని అస‌త్య ఆరోప‌ణ‌లు చేశారు. 


అయితే భార‌త ప్ర‌భుత్వం కూడా ఇమ్రాన్ వ్యాఖ్య‌ల‌కు గ‌ట్టి కౌంట‌ర్ ఇచ్చింది. ముందు పాకిస్థాన్లో ద‌రిద్రాన్ని వ‌దిలించుకుని మాట్లాడాల‌ని అన్నారు. కుల‌, మ‌త‌, భాష‌,ప్రాంతీయ బేధాల‌తో సంబంధం లేకుండా అత్యున్న‌త వైద్యం అందుతోంద‌ని భార‌త్ స్ప‌ష్టం చేసింది. మా దేశ ప్ర‌జ‌ల‌పై మాకు అభిమానం ఉంది. ఇక్క‌డ ఎవ‌రిని ఎవ‌రూ నిందిచ‌డం లేదు. మా దేశంలో ఐక్య‌తకు కొద‌వ‌లేదు. దాదాపు 25రోజులుగా ఏక‌బిగిన లాక్‌డౌన్ అద్భుతంగా అమ‌లవుతుండ‌టమే ఇందుకు నిద‌ర్శ‌నం. మా ఐక్య‌తను ప్ర‌పంచ దేశాల‌న్నీ కూడా గుర్తించాయి..ఒక్క మీరు త‌ప్పా అంటూ భార‌త ప్ర‌భుత్వం పాకిస్థాన్ ప్ర‌భుత్వానికి గ‌డ్డి పెట్టింది.


 క‌రోనా బాధితుల‌కు మెరుగైన వైద్యం అందించేందుకు కృషి చేయాల్సిన స‌మ‌యంలో భార‌త్‌పై విమ‌ర్శ‌ల‌కు స‌మ‌యం వెచ్చించ‌డం శోచ‌నీయం అంటూ పాకిస్థాన్ తీరును తూర్పార‌ప‌ట్టింది.  పాకిస్తాన్‌లో కరోనా వ్యాప్తిని అరికట్టలేకనే భారత​ ప్రభుత్వంపై ఇమ్రాన్‌ దిగాజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారంటూ విమర్శలను తిప్పికొట్టింది. పాక్‌లో కరోనా బారినపడిన వారికి కనీస వైద్య సదుపాయాలు లేవని వాటి నుంచి ప్రజల దృష్టి మరల్చడానికే ఇలా మాట్లాడుతున్నారని భార‌త్ పేర్కొంది. ఇదిలా ఉండ‌గా పాకిస్థాన్‌లో రోజూ వేలాది మంది క‌రోనా బారిన ప‌డుతున్నారు. ఇప్ప‌టికే వంద‌లాది మంది ప్రాణాలు కోల్పోయారు. స‌రైన వైద్య స‌దుపాయాలు లేకపోవ‌డంతో క‌రోనా విజృంభిస్తే ప‌రిస్థితి ఏంటీ అని అక్క‌డి ప్ర‌జ‌లు ప్రాణాలు అర‌చేతిలో పెట్టుకుని బ‌తుకీడిస్తున్నారు.

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: