లాక్‌డౌన్ అమ‌ల‌వుతున్న వేళ‌... కెనడాలో పోలీసు దుస్తులు ధరించి వచ్చిన ఓ దుండగుడు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డాడు. ఈ సంఘ‌ట‌న‌ నోవా స్కోటియా రాష్ట్రంలో ఆదివారం జరిగింది.  ఈ దుర్ఘ‌ట‌న‌లో ఓ మహిళా పోలీసు సహా మొత్తం 16 మంది ప్రాణాలు కోల్పోయిన‌ట్లు అధికారులు తెలిపారు. ప్రాణాల‌ను ర‌క్షించుకునేందుకు పోలీసులు జ‌రిపిన ఎదురుకాల్పుల్లో దుండ‌గుడు కూడా మ‌ర‌ణించిన‌ట్లుగా అధికారులు భావిస్తున్నారు. ఇంకా అత‌డి మృత‌దేహం ల‌భ్యంకాక‌పోవ‌డం ప‌లు అనుమానాల‌కు తావిస్తోంది.  దుండగుడు పోలీసుల దుస్తులు ధరించి, కారును కూడా పోలీసుల వాహనం వలే రూపొందించిన‌ట్లు అధికారులు తెలిపారు. 

 

అంటే ఎంతో ప‌క‌డ్బందీగా దుండ‌గుడు ఈ కాల్పుల‌కు దిగిన‌ట్లుగా అర్థ‌మ‌వుతోంది. పోలీస్‌శాఖ నుంచి ఏమైనా స‌హాయ స‌హాకారాలు అంది ఉంటాయ‌న్న అనుమానాల‌ను అధికారులు వ్య‌క్తం చేస్తున్నారు. ఈ ఘటనతో అప్రమత్తమైన పోలీసులు, స్థానిక యంత్రాంగం ప్ర‌జ‌లెవ‌ర‌ని ఎట్టి ప‌రిస్థితుల్లో బ‌య‌ట‌కు రావ‌ద్ద‌ని పోలీసులు ప్ర‌క‌టించారు. అయితే దుండ‌గుడు ఎందుకు కాల్పులు జ‌రిపాడు అన్న‌ది ఇంకా తెలియ‌రాలేదు. అత‌డి వ్య‌క్తిగత వివ‌రాలు సేక‌రించే ప‌నిలో అధికారులు నిమ‌గ్న‌మ‌య్యారు. అస‌లే క‌రోనాతో క‌కావిక‌లమ‌వుతున్న కెనాడాను ఈ సంఘ‌ట‌న మ‌రింత విషాదంలోకి తీసుకెళ్లింది. 

 

అయితే గత 30 ఏళ్ల కెనడా చరిత్రలో ఇంతటి దారుణ ఘటన జరగడం ఇదే తొలిసారని అధికారులు పేర్కొన్నారు. చివరి సారి 1989లో ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో 14 మంది మృత్యువాతపడ్డారు. అప్పటి నుంచి దేశంలో తుపాకుల వాడకంపై కఠిన ఆంక్షలు విధించారు.     ఇదిలా ఉండ‌గా అమెరికాలో క‌రోనా వైర‌స్ వేగంగా విస్త‌రిస్తోంది. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో లాక్‌డౌన్ అమ‌లు జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. మ‌రికొంత‌కాలం పాటు లాక్‌డౌన్‌ను పొడ‌గిస్తార‌న్న వార్త‌లు వస్తుండ‌టంతో కొంత‌మంది వ్యాపారుల నుంచి నిర‌స‌న స్వ‌రం వ్య‌క్త‌మ‌వుతోంది. ప్రాణాల‌క‌న్నా మీకు వ్యాపారాలే ముఖ్య‌మా అంటూ మ‌రికొంత మంది వారిని తిట్టిపోస్తున్నారు. 

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: