తెలంగాణ ఐటీశాఖ మంత్రి, టీఆర్ ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ త‌న డైన‌మిక్ లీడ‌ర్‌షిప్‌తో ద్వేషించిన వారిని సైతం అభిమానులు మార్చుకుంటున్నారు. ఇలా ఆయ‌న వైపు ఆక‌ర్షితులైన వారిలో ల‌క్ష‌లాది మంది ఉన్నారంటే అతిశేయోక్తి కాదు. ప్రాంతాల‌తో సంబంధం లేకుండా ఇలా ఆయ‌న‌కు అభిమానులుగా మారిపోతున్నారు. తాజాగా సుధీర్ అనే యువ‌కుడు కేటీఆర్‌పై త‌న అభిమానాన్ని కేటీఆర్‌తో పంచుకున్నారు.  కేటీఆర్ సార్‌..మీర‌న్న‌..మీ తండ్రి కేసీఆర్ గార‌న్న నాకు చాలా ద్వేషం ఉండేది. కానీ మీరు తెలంగాణలో గ‌త ఐదేళ్లుగా అందిస్తున్న పాల‌న చూసి మీ అభిమానిగా మారిపోయానంటూ ట్వీట్ చేశాడు.

 

 

ఈ ట్వీట్‌కు ప్ర‌తిస్పంద‌న‌గా అనేక మంది నెటిజ‌న్లు కేటీఆర్ గురించి త‌మ అభిప్రాయాల‌ను ట్విట్ట‌ర్‌తో పాటు ఇత‌ర సోష‌ల్ మీడియా వేదిక‌ల‌పై పంచుకుంటున్నారు. క‌రోనా వైర‌స్ వ్యాప్తి నేప‌థ్యంలో తెలంగాణ రాష్ట్రంలో మీ ప్ర‌భుత్వం తీసుకుంటున్న నిర్ణ‌యాలు, పాటిస్తున్న నియ‌మ నిబంధ‌న‌లు దేశం మొత్తానికే ఆద‌ర్శ‌నీయంగా ఉంటున్నాయి. దేశం మొత్తం మీ పాల‌న అందితే బాగుండ‌న్న అభిప్రాయం దేశ ప్ర‌జానీకంలో వ్య‌క్త‌మ‌వుతోంది. అంటూ మ‌రో అభిమాని త‌న అభిప్రాయాన్ని ట్విట్ట‌ర్‌లో పోస్టు చేశాడు. సుధీర్ ప్ర‌తిస్పంద‌న‌కు చాలామంది కేటీఆర్ అభిమానులు క్ల‌బ్‌లోకి వెల్‌క‌మ్ బ్ర‌ద‌ర్ అంటూ ప్ర‌తిస్పంద‌న తెలియ‌జేశారు.

 


క‌రోనా వైర‌స్ వ్యాప్తిని అరిక‌ట్టేందుకు టీఆర్ ఎస్ ప్ర‌భుత్వం ఎంతో శ్ర‌ద్ధ‌తో వ్య‌వ‌హ‌రిస్తున్న విష‌యం తెలిసిందే. కేంద్ర ప్ర‌భుత్వం నుంచి కూడా ప్ర‌శంస‌లు అందుకుంటోంది. రాష్ట్ర ప్ర‌జానీయం ప్రాణాల క‌న్నా ఏదీ ఎక్కువ కాద‌ని, ఆర్థికంగా న‌ష్టం జ‌రిగితే పూడ్చుకోవ‌డానికి ఎన్నో మార్గాలున్నాయి...ప్రాణాలు మాత్రం తిరిగి తేలుమన్నా ముఖ్య‌మంత్రి మాట‌ల‌కు దేశం మొత్తం ఫిదా అయింది. కేటీఆర్ అయితే ట్విట్ట‌ర్‌లో ఎంతో ఆక్టివ్‌గా ఉంటున్నారు. ఆప‌ద‌లో ఉన్నాం కాపాడ‌మ‌ని రెక్వెస్ట్ చేయ‌గానే వెంట‌నే త‌గిన ఏర్పాట్లు చేస్తున్నారు. పాప‌కు పాలు దొర‌క‌డం లేద‌ని అర్ధ‌రాత్రి 12గంట‌ల‌కు ఓ వ్య‌క్తి చేసిన ట్వీట్‌కు కూడా స్పందించిన పాలు అందేలా చేసిన విష‌యం తెలిసిందే. 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: