ప్రముఖ ప్రైవేట్ బ్యాంకు సంస్థ అయినా ICICI కస్టమర్ల కోసం ఇన్స్టెంట్ సేవింగ్ అకౌంట్ సేవలు అందించాలని నిర్ణయం తీసుకుంది. అకౌంట్ సేవలు పొందడానికి ఆన్లైన్ లో దరఖాస్తులు చేసుకోవాలి.  ఈ సేవింగ్ అకౌంట్ ఆధార్ ఆధారిత ఇన్స్టెంట్ డిజిటల్ సేవింగ్ అకౌంట్. ఈ అకౌంట్ కోసం 18 ఏళ్ళ వయస్సు ఉంటే చాలు. ఇంట్లో ఉండే ఇన్స్టెంట్ సేవింగ్ అకౌంట్ సులువుగా పొందవచ్చు. ఇక ఇందులో 2 సేవింగ్ అకౌంట్ లుగా విభజించారు. ఇన్‌స్టా సేవ్ అకౌంట్ ఒకటి, మరొకటి ఇన్‌స్టా సేవ్ ఎఫ్డి అకౌంట్. ఇక ఇన్స్టా సేవింగ్ అకౌంట్ కు మాత్రం మంత్లీ మినిమమ్ బ్యాలెన్స్ ఖచ్చితంగా పదివేల రూపాయలు ఉండాలి అనే నిబంధన పెట్టింది. ఇక ఇన్స్టా ఎఫ్ డి అకౌంట్ కి మాత్రం ఎటువంటి మినిమమ్ బ్యాలెన్స్ లేదు. ఇక ఈ అకౌంట్ కి సంవత్సరం లోపు పదివేల రూపాయలు కచ్చితంగా చేయాలి. 

 

ఇక ఎవరైనా ICICI ఎఫ్ డి సేవింగ్ అకౌంట్ ఓపెన్ చేస్తే వారికి ఉచితంగా క్రెడిట్ కార్డ్ సేవలు అందిస్తుంది. అంతేకాకుండా కష్టమర్ ఫిక్స్ డ్ డిపాజిట్ చేసిన మొత్తంలో 90 శాతం వరకు క్రెడిట్ కార్డ్ పొందే అవకాశం కూడా కలిపిస్తుంది ICICI బ్యాంకు. ఇలా చేయడంతో రోజు వారి ఖర్చులకు క్రెడిట్ కార్డ్ సులువుగా ఉపయోగించుకోవచ్చు. 


దీనితోపాటు బ్యాంకు అధికారిక వెబ్సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా కూడా సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేసుకునే అవకాశం కల్పించింది. అలాగే ఒక్కసారి అకౌంట్ ఓపెన్ చేయగానే వెంటనే చేసుకునే అవకాశం కల్పించింది. ఇలా అప్లై చేసుకోవడానికి కస్టమర్ల నుంచి ఆధార్ కార్డు పాన్ కార్డ్ వివరాలు అందిస్తే చాలు. ఆ తర్వాత బ్యాంకుకు వెళ్లి డాక్యుమెంట్లు బ్యాంకు అధికారులకు అందించి KYC వెరిఫికేషన్ పూర్తి చేసుకునే అవకాశం కల్పించింది ICICI బ్యాంకు. కస్టమర్లని ఆకర్షించడానికి ప్రస్తుతం ఎన్నో విధాలా ప్రయత్నాలు చేస్తున్నాయి ప్రవేట్ బ్యాంకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: