దేశంలో గత నెల 24 నుంచి లాక్ డౌన్ పాటిస్తున్న విషయం తెలిసిందే.  ఈ సందర్బంగా ప్రజలు ఇంటికే పరిమితం కావాలని సూచిస్తున్నారు. అయితే కొంత మంది మాత్రం లాక్ డౌన్ విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. వాస్తవానికి 14 వరకు లాక్ డౌన్ ఉన్నప్పటికీ కరోనా వ్యాప్తి పెరిగిపోతున్న నేపథ్యంలో వచ్చే నెల 3 వరకు కరోనా పొడిగించారు.  కరోనా వైరస్ ప్రభావం అతి తక్కువగా ఉన్న ప్రాంతాల్లో లాక్ డౌన్ కు ఈ రోజు నుంచి కొన్ని సడలింపులు ఇచ్చారు. వలస కార్మికులకు ఉపాధిని కల్పించేందుకు ఈ చర్యలు ఉపయోగపడనున్నాయి. అయితే లౌక్ డౌన్ సడలించిన ప్రదేశాల్లో ఏమేమి పనిచేస్తాయి.. ఏవి పని చేయవు అన్న విషయం పై పూర్తి వివరాలు:

 

పనిచేసేవి : 

 

-నీరు, శానిటేషన్, వేస్ట్ మేనేజ్ మెంట్, పవర్ రంగాలు.
 -సరుకుల లోడింగ్, అన్ లోడింగ్ పనులు (రాష్ట్ర, అంతర్రాష్ట్ర).
-ఆర్బీఐ, బ్యాంకులు, సెబీ, ఇన్స్యూరెన్స్ కంపెనీలు.
-సామాజిక దూరం పాటిస్తూ, మాస్కులు ధరించి... జాతీయ గ్రామీణ ఉపాధి పనులు.
- ఆన్ లైన్ టీచింగ్, డిస్టెన్స్ లెర్నింగ్.
-మెడికల్, వెటర్నరీ కేర్ సామగ్రిని తీసుకెళ్లే ప్రైవేట్ వాహనాలు.
- కేంద్ర, రాష్ట్ర, స్థానిక సంస్థల కార్యాలయాలు.
-బాలురు, వికలాంగులు, సీనియర్ సిటిజన్ల వసతి గృహాలు.
- ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, డీటీహెచ్, కేబుల్ సర్వీసులు.
- గిరిజనులు సేకరించే అటవీ ఉత్పత్తులు.
- కార్మికులు అదనంగా  అవసరం లేని, గ్రామీణ ప్రాంతాల్లో చేపట్టిన నిర్మాణ పనులు (రోడ్లు, ఇరిగేషన్ ప్రాజెక్టులు).
- ప్రభుత్వ కార్యకలాపాల కోసం  పని చేసే డేటా సెంటర్లు, కాల్ సెంటర్లు. మెడికల్, ఎమర్జెన్సీ  స్టాఫ్ కోసం హోటల్స్, లాడ్జిలు.
-గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు పరిశ్రమలు. ఫుడ్ ప్రాసెసింగ్, ఔషధాలు, మెడికల్ ఎక్విప్ మెంట్ కంపెనీలు.

 

పని చేయనివి : 


-రైలు, రోడ్డు, విమాన ప్రయాణాలు.
-సినిమా థియేటర్లు, షాపింగ్ కాంప్లెక్సులు.
-రాజకీయ, సామాజిక కార్యకలాపాలు.
-పారిశ్రామిక, వాణిజ్య కార్యకలాపాలు.
-ఆతిథ్య రంగం.
-మతపరమైన కార్యక్రమాలు.
-ఒక్క రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి వెళ్లేందుకు వలస కార్మికులకు అనుమతి నిరాకరణ.
- ఈకామర్స్ కంపెనీలు సరఫరా చేసే అత్యవసరం కాని వస్తువులు.
-విద్యాలయాలు, ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్.  

 


కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle


Apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: