అర‌బ్ దేశం సౌదీలో క‌రోనా కాటుకు మొత్తం ఎనిమిది మంది భార‌తీయులు మ‌ర‌ణించిన‌ట్లు ఆదేశ విదేశాంగ అధికారులు ప్ర‌క‌టించారు. మృత‌దేహాల‌ను ఇండియాకు పంపించ‌లేని స్థితిలో వైద్యుల సూచ‌న మేర‌కు వారి ప‌ర్య‌వేక్ష‌ణ‌లోనే సౌదీ అధికారులు ఖ‌న‌నం చేశారు. ఇక వారి కుటుంబ స‌భ్యుల్లో కూడా కొంత‌మందికి క‌రోనా ల‌క్ష‌ణాలు క‌నిపించ‌డంతో క్వారంటైన్‌కు తర‌లించి వైద్య ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తున్నారు. ఇక మృతిచెందిన భార‌తీయుల్లో అంద‌రూ కూడా చాలాకాలంగా సౌదీలో ఉంటున్న‌వారేన‌ని తెలుస్తోంది. వీరు ఇండియాలోని వివి ధ ప్రాంతాల‌కు చెందిన‌వారిగా సౌదీ అధికారులు వెల్ల‌డించారు. 

 

మృతుల్లో మక్కాలో ఎలక్ట్రికల్ ఇంజనీర్లుగా పనిచేస్తున్న మహమ్మద్ అస్లమ్ ఖాన్, అజ్మతుల్లా ఖాన్ ఉన్నారు. అలాగే ఇత‌ర ప‌నులు నిర్వ‌హిస్తూ జీవ‌నం సాగిస్తున్న  కేరళ, ఉత్తరప్రదేశ్,మహారాష్ట్రలకు చెందిన మరో ఆరుగురు ఉన్నారు. అజ్మతుల్లా ఖాన్(65) స్వ‌స్థ‌లం తెలంగాణ‌గా తెలుస్తోంది. అయితే పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది. గ‌త కొంత‌కాలంగా క‌రోనా ల‌క్ష‌ణాలు క‌లిగి ఉండ‌గా ఇటీవ‌లే పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయింది.  మక్కాలోని కింగ్ ఫైజల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందిన‌ట్లు సౌదీ ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది.అలాగే అస్లమ్ ఖాన్(51) స్వస్థలం భారత్‌లోని ఉత్తరప్రదేశ్‌లో ఉన్న మీరట్. 

 

సౌదీలో పనిచేస్తున్న అస్లమ్‌కు ఏప్రిల్ 3న మక్కాలోని కింగ్ ఫైజల్ ఆసుపత్రిలో క‌రోనా ల‌క్ష‌ణాల‌తో చేరాడు. రెండు వారాల పాటు చికిత్స పొందినా కోలుకోలేక‌పోయాడు.  వెంటిలేటర్‌పై చికిత్స అందించగా.. గత శనివారం (ఏప్రిల్ 18)న అతను కన్నుమూశాడు. ఖాన్‌కి భార్య, ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు.  ప్రస్తుతం వీరంతా వైద్యుల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ఉన్న‌ట్లు స‌మాచారం. వీరితో పాటు భారత్‌కు చెందిన ఫక్రే ఆలమ్, బర్కత్ అలీ అబ్దుల్లాతీఫ్, హైదరాబాద్‌కి చెందిన మహమ్మద్ సాదిఖ్, మహారాష్ట్రకు చెందిన సయ్యిద్ జునైద్ కూడా ఉన్న‌ట్లు సౌదీ ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. 

 


క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: