ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారిని విస్తరిస్తున్న తరుణంలో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ కష్టకాల సమయంలో టెలికాం సంస్థ రిలయన్స్ జియో వారి కస్టమర్లకు శుభవార్త తెలియజేసింది. కేంద్ర ప్రభుత్వం మే 3 వరకు లాక్ డౌన్ పొడిగించిన సమయంలో జియో ప్రీపెయిడ్ కస్టమర్లకు ఇన్ కమింగ్ కాల్స్ పొందే అవకాశాన్ని కల్పించింది రిలయన్స్ సంస్థ. ఇది ప్రీ పెయిడ్ కస్టమర్లకు ఒక శుభవార్త అనే చెప్పాలి. అంతేకాకుండా రీఛార్జ్ ప్లాన్ పరిమితి పూర్తి అయిన కూడా ఇన్ కమింగ్ కాల్స్ ఈ విషయంలో కూడా ఎటువంటి అంతరాయం ఉండదు అని సంస్థ అధికారులు ప్రకటించడం జరిగింది. 

 


ఈ సదుపాయం రిలయన్స్ జియో వినియోగదారులందరికీ కూడా అందుబాటులోకి వస్తుంది అంటూ జియో సంస్థ అధినేతలు వెల్లడించారు. ఇది ఇలా ఉండగా ఇది ఎలా అమలు అవుతుంది అన్న విషయం పై ఎటువంటి స్పష్టత తెలియజేయలేదు. మరోవైపు టెలికాం దిగ్గజ సంస్థ bsnl కూడా తన కస్టమర్లకు మే 5 వరకు ఇన్ కమింగ్ కాల్స్ పరిమితి పొడిగించిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. ఆ తర్వాత రిలయన్స్ జియో సంస్థ కూడా తన కస్టమర్లకు ఈ అవకాశాన్ని కల్పించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ క్రమంలోనే ప్రముఖ దిగ్గజ టెలికాం సంస్థ అయిన ఎయిర్ టెల్ కూడా మే 3 వరకు అన్ని ప్రీ పెయిడ్ కస్టమర్లకు ఇన్ కమింగ్ కాల్స్ సేవలలో ఎటువంటి అంతరాయం కలగకుండా ఉండాలనే ఉద్దేశపూర్వకంగా అదే విధానాన్ని అమల్లోకి తీసుకొని రావడం జరిగింది.

 

 

ఇది ఇలా ఉండగా కరోనా మహమ్మారి ఉన్న తరుణంలో కారణంగా ప్రముఖ దేశీయ టెలికాం సంస్థలు వారి వినియోగదారులకు పలు కండిషన్లు సవరించడం జరిగింది. అలాగే ఎటిఎంల ద్వారా రీఛార్జ్ చేసుకునే అవకాశం కల్పించడంతో ఆన్లైన్ రీఛార్జ్ చేసుకోలేని కస్టమర్లకు రీఛార్జ్ చేయడం ద్వారా కమిషన్ పొందే అవకాశాన్ని కూడా కల్పించడం జరిగింది. ఏది ఏమైనా కూడా ప్రీపెయిడ్ కస్టమర్ లో అందరికీ ప్రముఖ టెలికాం సంస్థలు అన్నీ కూడా మంచి శుభవార్త తెలియజేశాయి అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: