ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారూ స్వయంగా నటుడు రానా దగ్గుబాటి కి కృతజ్ఞతలు తెలియజేశాడు. ఈరోజు   తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారి జన్మదినం సందర్భంగా పలు సినీమా స్టార్స్ మరియు ఇతర నేతలు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. అయితే రానా దగ్గుబాటి తన ట్విట్టర్ ఖాతాలో చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశాడు.

 

అయితే  ఎన్టీఆర్ బయోపిక్ లో రానా దగ్గుబాటి చంద్రబాబు నాయుడు గారి క్యారెక్టర్ ను పోషించారు మరియు మెప్పించారు. చంద్రబాబు నాయుడు రానాకు బదులిస్తూ జన్మదిన సందర్భంగా విష్ చేసినందుకు కృతజ్ఞతలు మరియు సినిమాలో నువ్వు చేసిన గొప్ప నటనకు కృతజ్ఞతలు. అదేవిధంగా జీవితంలో మంచి విజయాలను అందుకోవాలని ఆశిస్తున్నానని చంద్రబాబు నాయుడు తెలియజేశారు

మరింత సమాచారం తెలుసుకోండి: