కరోనా  వైరస్ తెలుగు రాష్ట్రాలను కబళిస్తోంది. మొన్నటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతి తక్కువగా నమోదు అయిన కరోనా వైరస్ కేసులు ఇప్పుడు మాత్రం క్రమక్రమంగా పెరిగిపోతూనే ఉన్నాయి. అటు ప్రభుత్వం అన్ని ముందస్తు జాగ్రత్తలు చేపట్టినప్పటికీ కరోనా వైరస్ కట్టడి మాత్రం సాధ్యపడడం లేదు. రోజురోజుకు పెరిగిపోతున్న కరోనా  వైరస్ కేసుల కారణంగా ప్రజలు మరింత భయాందోళనకు గురవుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదట్లో అతి తక్కువగా నమోదైన కరోనా వైరస్ కేసులు ఇప్పుడు మాత్రం క్రమక్రమంగా పెరిగిపోతూనే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. ప్రతిరోజు పదుల సంఖ్యలో కరోనా  వైరస్ పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి...దీంతో  ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం మొత్తం భయం గుప్పిట్లో బతుకుతుంది. 

 

 

 ఇప్పటికే  రోజురోజుకు భారీ మొత్తంలో కేసులు నమోదు ప్రజలను బెంబేలెత్తిస్తుండగా... తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 75 పాజిటివ్ కేసులు నమోదు కావడం మరింత భయాందోళనకు గురిచేస్తుంది. దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిస్థితి చేయి దాటి పోయే లా కనిపిస్తుంది. ఈరోజు ఒక్కరోజే మొత్తంగా 75 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం... ఈ ఒక్కరోజే 75 మంది ప్రపంచ మహమ్మారి కరోనా వైరస్ బారిన పడినట్టు నిర్ధారణ అయ్యింది. గడచిన 24  గంటల్లో అనంతపురం జిల్లాలో 4 కరోనా  వైరస్ పాజిటివ్ కేసులు నమోదు కాగా,  చిత్తూరు జిల్లాలో ఏకంగా 25 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 

 

 

 తూర్పుగోదావరి జిల్లాలో ఇద్దరు కరోనా వైరస్ బారిన పడగా... గుంటూరు జిల్లాలో 20 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కడప జిల్లాలో మూడు కరొండు వైరస్ పాజిటివ్ కేసులు నమోదవగా... కర్నూలు జిల్లాలో 16 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కృష్ణా జిల్లాలో మూడు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా కరోనా వైరస్ కర్నూలు జిల్లాలో ఎక్కువగా విజృంభిస్తుంది. ఇప్పటివరకు కర్నూలు జిల్లాలో 174 పాజిటివ్ కేసులు నమోదు కావడం అందరినీ భయాందోళనకు గురిచేస్తుంది. మొత్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటివరకు 722 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు . కాగా ఇప్పటి వరకు 92 మంది ఈ మహమ్మారి బారినుంచి కోలుకొని డిశ్చార్జి కాగా... 20 మంది మరణించారు. రోజుకు కరోనా  వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో జగన్ సర్కార్ నిబంధనలను సడలించి మరింత కఠినతరం చేసే అవకాశాలున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: