దేశంలో ఏ దుర్ముహూర్తంలో కరోనా  ప్రవేశించిందో కానీ.. అప్పటి నుంచి దాని తీవ్రత రోజు పెరిగిపోతూనే ఉంది. దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. లాక్‌డౌన్ విధించినా.. చాలా ప్రాంతాల్లో కరోనా ఉధృతి మాత్రం తగ్గడం లేదు. ముంబై కరోనా హాట్‌స్పాట్‌గా మారడంతో మహారాష్ట్ర ప్రభుత్వానికి కంటి మీద కునుకు ఉండటం లేదు.  గత నెలలో కరోనా ఎక్కువ విదేశీయుల నుంచి వచ్చిందని భావించారు.  ఆ తర్వాత ఢిల్లీ ముజాహిద్దీన్ మర్కజ్ ప్రార్థనలో పాల్గొన్న వారి వల్లె ఎక్కువ విస్తరిస్తుందిని అన్నారు.  

 

ఏది ఏమైనా కొంత మంది నిర్లక్ష్యం మూలాన ఈ మాయదారి వైరస్ రోజు రోజుకీ పెరిగిపోతుంది. దేశంలో 736 జిల్లాలు ఉండగా.. ఏప్రిల్ 19 నాటికి 325 జిల్లాల్లో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. మిగతా 411 జిల్లాల్లోనే కరోనా కేసులు నమోదయ్యాయి. తాజాగా భారత్ లో పాజిటివ్ కేసుల సంఖ్య 17,656కు చేరినట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

 

ఇందులో యాక్టివ్ కేసులు 14,255, కోలుకున్న లేదా డిశ్చార్జి అయిన వాళ్లు 2841 మంది కాగా, మృతి చెందిన వారు 559 మంది ఉన్నారు. మైగ్రేటెడ్ -1 గా ఆ ప్రకటనలో పేర్కొంది. ఇదిలా ఉంటే..  గ్రీన్ జోన్ ప్రాంతాల్లో లాక్‌డౌన్ నిబంధనలను కేంద్రం కొద్దిగా సడలించింది.

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle


Apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: