దేశంలో కరోనా వైరస్ ని తరిమి కొట్టేందుకు ప్రతి ఒక్కరూ యుద్దం చేస్తున్నారు.  కరోనాని అరికట్టేందుకు లాక్ డౌన్ పాటిస్తున్న విషయం తెలిసందే. కరోనా వైరస్ భారత్ లో అడుగిడిన తొలినాళ్లలోనే సీఎం జగన్ స్పందించారని, అన్ని రాష్ట్రాల కంటే ముందు మేల్కొన్నది మన ముఖ్యమంత్రేనని ఏపీ వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని అన్నారు.  ర్యాపిడ్ టెస్ట్ కిట్ల కొనుగోలులో అవినీతి చోటుచేసుకుందన్న విపక్షాల ఆరోపణలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.   

 

టీడీపీ నేతలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.టీడీపీ నేతలు కరోనాకు భయపడి ఇళ్లలో దాక్కున్నారని ఎద్దేవా చేశారు. ఇల్లు దాటి బయటికి వస్తే ఎక్కడ కరోనా సోకుతుందోనని హడలిపోతున్నారని.. అలాంటి వారు కూడా మాట్లాడటం విడ్డూరంగా ఉందని అన్నారు.  ఓవైపు మేం ఎన్-95 మాస్కులు, పీపీఈలు, వెంటిలేటర్ల కోసం ఆయా సంస్థలతో ఒప్పందాలు చేసుకుంటుంటే ఆ రోజు కూడా మాపై ఆరోపణలు చేశారు.

 

. పీపీఈలు లేవు, ఎన్-95 మాస్కులు లేవంటూ బురద చల్లే ప్రయత్నం చేశారు.బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.  ఏపి సీఎం కరోనా ని అరికట్టేందుకు తన వంతు కృషి చేస్తున్నారని అన్నారు.  ఇలాంటి పరిస్థితుల్లో కన్నా, చంద్రబాబుతో కుమ్మక్కై సీఎం జగన్ పై విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle


Apple : https://tinyurl.com/NIHWNapple

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: