భారత దేశంలో గత నెల 24 నుంచి కరోనా మహమ్మారిని తరిమి కొట్టేందుకు లాక్ డౌన్  ప్రకటించిన విషయం తెలిసిందే.  గత నెల నుంచి కరోనా విస్తరిస్తూ వస్తుంది.  దేశం మొత్తం కరోనా భారిన పడుతుంటే.. కొన్ని రాష్ట్రాలు మాత్రం కరోనా లేకండా బయట పడుతున్నాయి. కరోనా రహిత రాష్ట్రంగా గోవా నమోదు అయింది. ఆ రాష్ట్రంలో 800 మందికి పరీక్షలు జరపగా, ఏడుగురికి పాజిటివ్ తేలగా వారికి చికిత్స చేశారు. గోవా కరోనా లేని తొలి రాష్ట్రంగా నమోదు అయిందని, ఇది సంతోషం కలిగించే విషయమని ఆయన పేర్కొన్నారు. అయినా కేంద్రం చేసిన నిబంధనల ప్రకారం లాక్ డౌన్ కొనసాగుతుందని ఆయన తెలిపారు.

 

తాజాగా కరోనా లేని రాష్ట్రాల జాబితాలో మరో రాష్ట్రం వచ్చి చేరింది. తమది కరోనా లేని రాష్ట్రంగా మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్.బీరేన్ సింగ్   ప్రకటించారు.  కరోనా రహిత రాష్ట్రంగా మణిపూర్ నిలిచిందని సీఎం సోషల్ మాద్యమంలో పోస్ట్ చేశారు.   కరోనా పాజిటివ్‌గా నిర్దారించిన ఇద్దరు పేషెంట్లు పూర్తిగా కోలుకున్నారు. చికిత్సానంతరం వారికి కరోనా నెగిటివ్‌ వచ్చింది. రాష్ట్రంలో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు.  అయితే ఇదంతా ప్రజలు, వైద్య సిబ్బంది సహకారం, లాక్‌డౌన్ కఠినంగా అమలు చేయడం వల్లే సాధ్యమైంది' అని సింగ్ అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: